
మన శరీరంలో కొన్ని అవయవాలు పరిమాణంలో చిన్నవైనా, వాటి పని మాత్రం అసాధారణంగా ఉంటుంది. అలాంటి వాటిల్లో అడ్రినల్ గ్రంథులు ఒకటి. ప్రతి అడ్రినల్ గ్రంథి సుమారు 4–6 గ్రాముల బరువు మాత్రమే ఉంటుంది. ఆకారంలో చిన్న త్రిభుజంలా కనిపించే ఈ గ్రంథులు ఒక్కో కిడ్నీపైన ఒక్కటి ఉంటాయి. జీవక్రియలకు అత్యవసరమైన హార్మోన్లను ఉత్పత్తి చేసే శక్తిమంతమైన గ్రంథులివి. ఈ అడ్రినల్ గ్రంథి చేసే అద్భుతమైన పనులేమిటో తెలుసుకుందాం. చాలా మందికి అడ్రినల్ గ్రంథుల గురించి పెద్దగా తెలియదు. కానీ ప్రతి రోజు మన శరీరంలో జరిగే అనేక ముఖ్యమైన ప్రక్రియలను ఇవే నియంత్రిస్తాయి. ఒత్తిడి సమయంలో అడ్రినల్ గ్రంథుల పాత్ర మనిషి ప్రమాదంలో ఉన్నప్పుడు లేదా అత్యవసర పరిస్థితుల్లో అడ్రినల్ గ్రంథులు వెంటనే స్పందిస్తాయి. ఈ సమయంలో అడ్రినలిన్ విడుదల అవుతుంది. ఫలితంగా గుండె వేగంగా కొట్టుకోవడం రక్తపోటు పెరగడం శరీరానికి తక్షణ శక్తి అందించడం మెదడు అప్రమత్తంగా మారడం జరుగుతుంది. ఇలా జరగడాన్ని వైద్యపరంగా ‘ఫైట్ లైదా ఫ్లైట్ రెస్పాన్స్’ అంటారు. అంటే ప్రమాదాన్ని ఎదుర్కొని పోరాడటానికీ లేదా ఆ పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి శరీరం సిద్ధమవుతుంది. కార్టిసోల్ అంటే ఏమిటి... ఎందుకు అవసరం? కార్టిసోల్‌ను చాలామంది ‘స్ట్రెస్ హార్మోన్’ అని పిలుస్తారు. కానీ ఇది కేవలం ఒత్తిడికి సంబంధించిన హార్మోన్ మాత్రమే కాదు. ఇది... శక్తి వినియోగం వంటి అనేక ప్రక్రియల్లో కీలక పాత్ర పోషిస్తుంది. ఆల్డోస్టెరోన్ పని ఏమిటి? ఆల్డోస్టెరోన్ శరీరంలో సోడియం, పొటాషియంలతోపాటు నీటి సమతుల్యతను నియంత్రిస్తుంది. దీని ద్వారా రక్త΄ోటు నియంత్రణ జరుగుతుంది. కొంతమందిలో ఆల్డోస్టెరోన్ అధికంగా తయారవుతుంది. దీనిని ‘ప్రైమరీ హైపర్ ఆల్డోస్టెరోనిజం’ అంటారు. ఇది అధిక రక్త΄ోటుకు ఒక ముఖ్యమైన కారణం. కానీ... దీన్ని గుర్తించడం కష్టం. ముఖ్యంగా చిన్న వయసులోనే తీవ్రమైన బీపీ రావడం, మూడు నాలుగు మందులతో కూడా బీపీ నియంత్రణలోకి రాక΄ోవడం, రక్తంలో పొటాషియం తగ్గిపోవడం వంటి పరిస్థితుల్లో