పార్టీ కంటే.. దేశ సమగ్రతకే ప్రాధాన్యం
Actor ProfilePolitician

పార్టీ కంటే.. దేశ సమగ్రతకే ప్రాధాన్యం

Total News2
Movie Updates0
Sources1
పార్టీ కంటే దేశ సమగ్రతకే ప్రాధాన్యం
Eenadu15 Jun 2026
పార్టీ కంటే దేశ సమగ్రతకే ప్రాధాన్యం

దిల్లీ: జనసేన ప్రారంభించినప్పుడు దేశ సమగ్రత, శ్రేయస్సు తప్ప.. తనకు ఏ ఆలోచనా లేదని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ అన్నారు. పార్టీ స్థాపించినప్పుడు అధికారం వస్తుందో, రాదో కూడా తెలియదన్నారు. ‘జాతీయ సమగ్రత కోసం సేన ప్రస్థానం’ పేరిట దిల్లీలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ.. పార్టీ స్థాపించి 12 ఏళ్లు పూర్తయిందని, ఈ ప్రయాణంలో చాలా పోరాటాలు చేశామని, పరాజయాలు ఎదుర్కొన్నామని చెప్పారు. ‘‘మారుతున్న సామాజిక, రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా 7 ప్రాథమిక సూత్రాలను వదల్లేదు. నిర్దిష్ట ఆచరణాత్మక విధానంతో 21 ఎమ్మెల్యే స్థానాలు, 3 ఎంపీ స్థానాలను సాధించాం. లక్ష మంది సభ్యత్వంతో ప్రారంభమైన పార్టీకి.. 20 లక్షలకుపైగా సభ్యత్వాలు వచ్చాయి. ఇటీవల కాలంలో అన్ని ప్రాంతాల నుంచి వేల మంది పార్టీలో చేరుతున్నారు. పార్టీ ప్రయోజనాల కంటే.. దేశ సమగ్రతకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నాం. దేశ స్ఫూర్తిని కాపాడుకోవడం ఒక రోజుతో అయ్యే పని కాదు. దేశ స్ఫూర్తిని ప్రతితరం ముందుకు తీసుకెళ్లాలి. తెలంగాణ ఏర్పాటుకు ఏనాడూ జనసేన అడ్డు చెప్పలేదు. 2014లో ఏపీని విభజించిన తీరును చూసి మాత్రమే ఆవేదన వ్యక్తం చేశాం. విభజన విషయంలో కాంగ్రెస్‌ వ్యవహరించిన తీరు.. అసంతృప్తిని, అశాంతిని సృష్టించింది. అప్పటి నుంచి ఇప్పటికీ వారి ధోరణి మారలేదు. జనసేన సభకు అనుమతివ్వకుండా అడ్డుకోవడమే అందుకు ఉదాహరణ. దిల్లీ మెడలు వంచుతాం.. తడాఖా చూపిస్తామంటూ చాలామంది పెద్దలు మాటలు చెబుతారు. వాస్తవానికి అలాంటి నేతలు దిల్లీకి రాగానే వెనక్కి తగ్గుతారు. చాలాసార్లు మనకు మనం తక్కువగా అంచనా వేసుకుంటాం. ప్రతి వ్యక్తి కూడా సమాజంలో మార్పు తీసుకురావొచ్చు. ఈ మధ్య కాక్రోచ్‌ పార్టీ ఎలా పుట్టుకొచ్చిందో చూస్తున్నాం. కాక్రోచ్‌ పార్టీని చూస్తే.. చలిచీమల పద్యం గుర్తుకొచ్చింది. చలిచీమలు కూడా బలమైన పామును చంపేస్తాయి’’ అని పవన్‌ అన్నారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని

పార్టీ కంటే.. దేశ సమగ్రతకే ప్రాధాన్యం
Eenadu15 Jun 2026
పార్టీ కంటే.. దేశ సమగ్రతకే ప్రాధాన్యం

దిల్లీ: జనసేన ప్రారంభించినప్పుడు దేశ సమగ్రత, శ్రేయస్సు తప్ప ఏ ఆలోచనా లేదని పార్టీ అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. పార్టీ ప్రయోజనాల కంటే దేశ సమగ్రతకే తొలి ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. దిల్లీలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో పార్టీ శ్రేణులకు జాతీయ సమైక్యతపై ఆయన దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ఏర్పాటుకు జనసేన ఏనాడూ అడ్డు చెప్పలేదన్నారు. ఆనాడు ఏపీని విభజించిన తీరు నుంచి ఇవాళ్టికీ కాంగ్రెస్‌ ధోరణి మారలేదని విమర్శించారు. పార్టీ కంటే.. దేశ సమగ్రతకే ప్రాధాన్యం: పవన్‌