పెద్ది’ ట్రైలర్ విషయంలో పొరపాటు జరిగిందా? బుచ్చిబాబు ఏమన్నారంటే
Actor ProfileActor

పెద్ది’ ట్రైలర్ విషయంలో పొరపాటు జరిగిందా? బుచ్చిబాబు ఏమన్నారంటే

Total News1
Movie Updates0
Sources1
పెద్ది’ ట్రైలర్ విషయంలో పొరపాటు జరిగిందా? బుచ్చిబాబు ఏమన్నారంటే
Eenadu13 Jun 2026
పెద్ది’ ట్రైలర్ విషయంలో పొరపాటు జరిగిందా? బుచ్చిబాబు ఏమన్నారంటే

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రస్తుతం బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది ‘పెద్ది’. అయితే, అదే సమయంలో కథానాయిక పాత్ర చిత్రీకరణ, ప్రజెంట్‌ చేసిన విధానంపైనా విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పటికే ఈ విషయమై దర్శకుడు బుచ్చిబాబు వివరణ కూడా ఇచ్చారు. తాజాగా మరో అంశంపై ఆయన తన మనసులో మాట చెప్పారు. ముఖ్యంగా, ‘పెద్ది’ ట్రైలర్‌ సినిమాపై గట్టి ప్రభావాన్ని చూపించలేకపోయిందని అభిప్రాయపడ్డారు. కథా సారాన్ని ట్రైలర్‌ ప్రతిబింబించ లేకపోయిందన్నారు. విమర్శకులకు అవకాశమిచ్చినట్లు అయిందన్నారు. ఇందులో అప్పలసూరి పాత్ర పోషించిన జగపతిబాబు, దర్శకుడు బుచ్చిబాబుల మధ్య చిట్‌చాట్‌ జరిగింది. ఈ సందర్భంగా ట్రైలర్‌ గురించి జగపతిబాబు (Jagapathi Babu) మాట్లాడుతూ.. ‘సినిమా ట్రైలర్‌ విడుదలయ్యాక కొంత నెగెటివిటీ వచ్చింది. అది చూసిన తర్వాత సినిమాలో ఇంకా ఏ తప్పులున్నాయో వెతుకుదామనే ఆలోచనతో వచ్చారు. మరికొందరు సినిమాను భుజాలపైకి ఎత్తుకోవాలన్న ఉద్దేశంతో వచ్చారు. నేను కూడా మొదట్లో అంచనాలను అందుకోదేమోనుకున్నా. పెద్ద సినిమా విషయంలో ఇలాంటి పొరపాట్లు జరగకూడదు. కానీ జరిగిపోయింది’ అని అభిప్రాయపడగా, అందుకు బుచ్చిబాబు బదులిస్తూ ‘అవునండీ.. కథకు సంబంధించిన అనేక అంశాలను ట్రైలర్‌లో చూపించాం. దీంతో అంతా ఇరికించేసినట్లు అయింది’ అంటూ జగపతిబాబు అభిప్రాయంతో ఏకీభవించారు. ఇక చాలా మంది ‘పెద్ది’కి రివ్యూలు ఇచ్చారని, వాటికి లక్షల్లో లైక్‌లు వచ్చాయన్నారు. మూవీ బాగుందంటూ ఇన్ని రివ్యూలు ఇటీవల కాలంలో ఏ సినిమాకూ చూడలేదని బుచ్చిబాబు తెలిపారు. తన తర్వాతి సినిమా పూర్తి మాస్‌, యాక్షన్‌తో ఉంటుందని వెల్లడించారు. ఈ సందర్భంగా నటుడు జగపతిబాబు తనకు ఎదురైన ఓ ఆసక్తికర విషయాన్ని ప్రస్తావించారు. ‘‘పెద్ది’ మూవీ చూసిన ఓ పెద్ద దర్శకుడు నాకు ఫోన్‌ చేసి మాట్లాడారు. ‘ఇదేం ఖర్మండీ బాబూ..! మీరు చేసిన అప్పలసూరి పాత్ర మలయాళ, తమిళ, హిందీ నటుడో చేసి ఉంటే ఈ పాటికి ప్రశంసలతో ఆయన్ను ఎక్కడో కూర్చోబెట్టేవారు. మీరు తెలుగు వాడు కావటం మీ దురదృష్టం’ అని నాతో