
‘ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా.. బొమ్మరా.. ఆశగ చూసిన నాన్నకు పుట్టిన అమ్మరా.. అమ్మరా..’ అంటూ ఓ పాటలో చెప్పినట్లు ప్రతి తండ్రి తన కూతుర్ని ఓ బంగారు బొమ్మలానే అపురూపంగా చూసుకుంటాడు. కష్టాలను, కన్నీళ్లనూ దిగమింగుకుని ప్రేమను పంచుతాడు. నాన్నంటే బాధ్యత, భరోసా, భవిష్యత్తు..! ప్రతి తండ్రి తన కూతుర్ని ఓ బంగారు బొమ్మలానే అపురూపంగా చూసుకుంటాడు. కష్టాలను, కన్నీళ్లనూ దిగమింగుకుని ప్రేమను పంచుతాడు. అందుకే అమ్మాయిల జీవితంలో నాన్నే మొదటి హీరో. ఈ నేపథ్యంలో ‘ఫాదర్స్ డే’ సందర్భంగా తమ నాన్నతో ఉన్న అనుబంధాన్ని పంచుకోమని ‘వసుంధర.నెట్’ ఇచ్చిన పిలుపుకి పాఠకుల నుంచి చక్కటి స్పందన వచ్చింది. వాళ్లలో కొందరు తమ తండ్రి గురించి పంచుకున్న స్ఫూర్తిదాయక విశేషాలు ఇవీ! ప్రతి అమ్మాయికీ తన తండ్రే మొదటి హీరో. అలా నా జీవితానికీ మా నాన్నే హీరో. మా నాన్న లారీ డ్రైవర్. చిన్న వయసులోనే తన తండ్రిని కోల్పోయి కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నారు. పైచదువులు చదివే అవకాశం నాన్నకు దక్కలేదు. కానీ, తన పిల్లలు మాత్రం మంచి విద్యను పొందాలని కలలు కన్నారు. ఆ కలను నిజం చేయడానికి ఎన్నో త్యాగాలు చేశారు. రేయి, పగలు తేడా లేకుండా.. ఎండా, వాన లెక్క చేయకుండా లారీ నడిపారు. సంపాదించిన ప్రతి రూపాయినీ మా చదువులకే ఖర్చు చేశారు. మా ముగ్గురినీ కార్పొరేట్ కళాశాలలో చదివించారు. మా సోదరుడితో సమానంగా పెంచారు. మా కోరికలను తీర్చడానికి తన ఇష్టాలను వదులుకున్నారు. ఈ క్రమంలో తన అలసట, బాధ, కష్టాలను ఎప్పుడూ బయటపెట్టలేదు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఆయన ముఖంలో చిరాకును ఎప్పుడూ చూడలేదు. నేను ఈరోజు సాధించిన ప్రతి చిన్న విజయం వెనక మా నాన్న కష్టం ఉంది. అందుకే నా జీవితంలో ఆయన ఒక తండ్రి మాత్రమే కాదు.. అంతకుమించి! ఈ కథనం నా తండ్రికి మాత్రమే కాదు