తెలంగాణ కొత్త సీఎస్ గా సంజయ్ జాజు
Actor ProfilePolitician

తెలంగాణ కొత్త సీఎస్ గా సంజయ్ జాజు

📊 Box Office Collections
Total News6
Movie Updates0
Sources6
తెలంగాణ కొత్త సీఎస్ గా సంజయ్ జాజు
TeluguOne12 Jul 2026
తెలంగాణ కొత్త సీఎస్ గా సంజయ్ జాజు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు నియామకం దాదాపు ఖరారైంది. ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఆయనను, తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థన మేరకు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా రిలీవ్ చేసింది. ప్రస్తుత సీఎస్ కె. రామకృష్ణారావు పదవీ కాలం ఈ నెల 30తో ముగియనున్న సంగతి తెలిసిందే. దీంతో.. అదే రోజున సంజయ్ జాజు నూతన సీఎస్‌గా బాధ్యతలు చేపట్టనున్నారని విశ్వసనీయ సమాచారం. 1992 బ్యాచ్, తెలంగాణ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన సంజయ్ జాజు.. దాదాపు 13 ఏళ్లు కేంద్ర సర్వీసుల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. కేంద్ర సమాచార, ప్రసార శాఖ కార్యదర్శిగా, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (కార్యదర్శిగా కీలకమైన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించారు. ప్రస్తుత సీఎస్ కె. రామకృష్ణారావు పదవీ విరమణకు సరిగ్గా వారం రోజుల ముందు ఆయనను సొంత కేడర్‌కు పంపుతూ కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేయడంతో సంజయ్ జాజు తెలంగాణ సీఎస్ గా బాధ్యతలు చేపట్టడం ఖాయమని తేలిపోయింది. తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థన మేరకు సంజయ్ జాజును ఆయన సొంత కేడర్‌కు తిరిగి పంపేందుకు కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపిందని కేంద్ర ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. గతంలో సంజయ్ జాజు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌గా, అప్పటి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా పనిచేశారు. అయితే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీనియర్ అధికారులు జయేష్ రంజన్, వికాస్ రాజ్ వంటి వారి పేర్లను పక్కన పెట్టి మరి సంజయ్ జాజు వైపు మొగ్గు చూపడానికికారణం.. సంజయ్ జాజుకు కేంద్రంలో ఆయనకున్న విస్తృత అనుభవం, ఢిల్లీ స్థాయిలో ఉన్న పలుకుబడి అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణ, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు, కొత్త విమానాశ్రయాల అభివృద్ధి

తెలంగాణ కొత్త సీఎస్ గా సంజయ్ జాజు
Telugu Times12 Jul 2026
తెలంగాణ కొత్త సీఎస్ గా సంజయ్ జాజు

తెలంగాణ ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్యదర్శిగా సంజయ్‌రాజు (Sanjay Raju) నియమితులయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం కేంద్ర సర్వీసులో ఈశాన్య ప్రాంత అభివృద్ధి కార్యదర్శిగా పని చేస్తున్న ఈయనను తెలంగాణ (Telangana) రాష్ట్రానికి పంపుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ప్రస్తుత సీఎస్ రామకృష్ణారావు (Ramakrishna Rao) ఈ నెలాఖరుకు పదవీ విరమణ చేయనుండగా, కొత్త ప్రధాన కార్యదర్శిగా సంజయ్‌జాజుతో పాటు జయేశ్‌రంజన్ (Jayesh Ranjan) పేర్లను పరిశీలించిన ముఖ్యమంత్రి చివరకు జాజు వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. 1992 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన సంజయ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ సబ్‌కలెక్టర్‌గా, పశ్చిమగోదావరి కలెక్టర్‌గా, హైదరాబాద్ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్‌గా, కమిషనర్‌గా, పౌరసరఫరాల సంస్థ కమిషనర్‌గా పని చేశారు. 2014 నుంచి కేంద్ర సర్వీసులో ఉన్నారు. జాజును సీఎస్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. ఆయన 2029 ఫిబ్రవరి వరకు సర్వీసులో ఉంటారు

తెలంగాణ కొత్త సీఎస్ గా సంజయ్ జాజు
Eenadu11 Jul 2026
తెలంగాణ కొత్త సీఎస్ గా సంజయ్ జాజు

నెలాఖరుకు పదవీ విరమణ చేయనున్న రామకృష్ణారావు హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్యదర్శిగా సంజయ్‌జాజు నియమితులయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం కేంద్ర సర్వీసులో ఈశాన్య ప్రాంత అభివృద్ధి కార్యదర్శిగా పని చేస్తున్న ఈయనను తెలంగాణ రాష్ట్రానికి పంపుతూ కేంద్ర ప్రభుత్వం మంగళవారం నిర్ణయం తీసుకొంది. ప్రస్తుత సీఎస్‌ రామకృష్ణారావు ఈ నెలాఖరుకు పదవీ విరమణ చేయనుండగా, కొత్త ప్రధాన కార్యదర్శిగా సంజయ్‌జాజుతో పాటు జయేశ్‌రంజన్‌ పేర్లను పరిశీలించిన ముఖ్యమంత్రి చివరకు జాజు వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. 1992 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన సంజయ్‌ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ సబ్‌కలెక్టర్‌గా, పశ్చిమగోదావరి కలెక్టర్‌గా, హైదరాబాద్‌ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్‌గా, కమిషనర్‌గా, పౌరసరఫరాల సంస్థ కమిషనర్‌గా పని చేశారు. 2014 నుంచి కేంద్ర సర్వీసులో ఉన్నారు. జాజును సీఎస్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. ఆయన 2029 ఫిబ్రవరి వరకు సర్వీసులో ఉంటారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

తెలంగాణ కొత్త సీఎస్ గా సంజయ్ జాజు
AP7AM11 Jul 2026
తెలంగాణ కొత్త సీఎస్ గా సంజయ్ జాజు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి (చీఫ్ సెక్రటరీ)గా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు నియామకం దాదాపు ఖరారైంది. ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఆయనను తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థన మేరకు కేంద్రం రిలీవ్ చేసింది. ప్రస్తుత సీఎస్ కె. రామకృష్ణారావు పదవీ కాలం జూన్ 30తో ముగియనుండటంతో అదే రోజున సంజయ్ జాజు నూతన సీఎస్‌గా బాధ్యతలు చేపట్టనున్నార‌ని అధికారిక వర్గాల సమాచారం.జాజు కెరీర్ ట్రాక్ రికార్డ్ ఇదే!1992 బ్యాచ్, తెలంగాణ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన సంజయ్ జాజు, దాదాపు 13 ఏళ్ల సుదీర్ఘ కాలం పాటు కేంద్ర సర్వీసుల్లో పనిచేశారు. తెలంగాణ కేడర్ అధికారులలో ఇంత ఎక్కువ కాలం కేంద్ర సర్వీసుల్లో పనిచేసిన వారిలో ఆయన ఒకరు. కేంద్ర సమాచార, ప్రసార శాఖ కార్యదర్శిగా, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (DoNER) కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుత సీఎస్ పదవీ విరమణకు సరిగ్గా వారం రోజుల ముందు ఆయనను సొంత కేడర్‌కు పంపుతూ కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (DoPT) నిన్న ఉత్తర్వులు జారీ చేయడంతో ఆయన నియామకం దాదాపు ఖాయమైంది. "తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థన మేరకు సంజయ్ జాజును ఆయన సొంత కేడర్‌కు తిరిగి పంపేందుకు కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపిందని" ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆయన తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌గా, నాటి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా సమర్థవంతంగా పనిచేశారు. అయితే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన వైపు

తెలంగాణ కొత్త సీఎస్ గా సంజయ్ జాజు..! 'మీసేవ' రూపకర్త, జాజు కెరీర్ ట్రాక్ రికార్డ్ ఇదే
Samayam Telugu11 Jul 2026
తెలంగాణ కొత్త సీఎస్ గా సంజయ్ జాజు..! 'మీసేవ' రూపకర్త, జాజు కెరీర్ ట్రాక్ రికార్డ్ ఇదే

తెలంగాణ రాష్ట్ర పరిపాలనలో కీలక మార్పు చోటు చేసుకోబోతోంది. రాష్ట్ర తదుపరి ప్రధాన కార్యదర్శిగా (CS) సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్‌జాజు నియమితులయ్యే ఛాన్సుంది. ప్రస్తుతం తెలంగాణ సీఎస్‌గా బాధ్యతలు

తెలంగాణ కొత్త సీఎస్ గా సంజయ్ జాజు.. లైన్ క్లియర్ అయినట్లేనా
Andhra Jyothy9 Jul 2026
తెలంగాణ కొత్త సీఎస్ గా సంజయ్ జాజు.. లైన్ క్లియర్ అయినట్లేనా

తెలంగాణ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు బాధ్యతలు చేపట్టేందుకు లైన్ క్లియర్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.. హైదరాబాద్, జూన్ 23: తెలంగాణ రాష్ట్ర నూతన