
సామాజిక ఉద్యమకారుడు గాదె ఇన్నయ్యపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ సందర్భంగా ఛార్జ్‌షీట్‌లో ఎన్ఐఏ పలు కీలక అంశాలను వెల్లడించింది. హైదరాబాద్: సామాజిక ఉద్యమకారుడు గాదె


సామాజిక ఉద్యమకారుడు గాదె ఇన్నయ్యపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ సందర్భంగా ఛార్జ్‌షీట్‌లో ఎన్ఐఏ పలు కీలక అంశాలను వెల్లడించింది. హైదరాబాద్: సామాజిక ఉద్యమకారుడు గాదె

మాజీమంత్రి కేటీఆర్‌పై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత షాకింగ్ కామెంట్స్ చేశారు. కేటీఆర్ సిరిసిల్లాకు వీకెండ్‌లో వచ్చి వెళ్లిపోతారని ఎద్దేవా చేశారు. సిరిసిల్ల, జూన్ 18 (ఆంధ్రజ్యోతి)

రామగుండం ఎరువులు పొందేలా కేంద్ర ప్రభుత్వంపై ఉద్యమిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. ప్రతి నెల 2లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఇస్తామని అన్నారని.. కానీ హామీ ఇచ్చిన మేరకు కేంద్రం

రైతు సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. లాభదాయక వ్యవసాయం వైపు తెలంగాణ అడుగులు వేయాలని సూచించారు. హైదరాబాద్, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): రైతు సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) వ్యాఖ్యానించారు. లాభదాయక వ్యవసాయం వైపు తెలంగాణ అడుగులు వేయాలని సూచించారు. పేదలు సన్నబియ్యం తినాలని.. రైతులు ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. సచివాలయంలో భట్టివిక్రమార్క అధ్యక్షతన ఈరోజు (బుధవారం) కేబినెట్ సబ్ కమిటీ సమావేశం అయింది. ఈ భేటీకి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడారు. వ్యవసాయ ఉత్పత్తి, ధాన్యం కొనుగోళ్లు, నిల్వ సదుపాయాలపై ఈ సమీక్షలో చర్చించామని తెలిపారు. నాణ్యమైన వరి రకాల సాగుకు ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తామని మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. BPT 5204, తెలంగాణ సోనామసూరి, KNM-1638, జై శ్రీరామ్, HMT రకాలపై ఫోకస్ పెట్టామని వివరించారు. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్ ఉన్న పంటలకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పుకొచ్చారు. బాయిల్డ్ రైస్ కొనుగోళ్లు నిలిపివేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర విధానాలతో తెలంగాణ రైతాంగం నష్టపోతోందని భట్టి విక్రమార్క విమర్శించారు. గ్రామగ్రామాన రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించాలని రైతు కమిషన్ తెలిపింది. మేలుజాతి వంగడాలతో రైతుల ఆదాయం పెరుగుతుందని వ్యవసాయ కమిషన్ సూచించింది. రాబోయే సీజన్లలో నాణ్యమైన వరి రకాల సాగు విస్తరణ లక్ష్యమని పేర్కొంది. ఎఫ్‌సీఐ కొనుగోళ్లు తగ్గించడంతో రైతులకు ఇబ్బందిగా మారిందని వ్యవసాయ కమిషన్ అభిప్రాయపడింది. బోనస్ ఇచ్చే 7 రకాల సన్న వడ్లు అందుబాటులో ఉంచాలి: సీఎం రేవంత్‌రెడ్డి