తిరుమలలో జనసేన కార్యకర్తల నిబంధనల ఉల్లంఘన
Actor ProfilePolitician

తిరుమలలో జనసేన కార్యకర్తల నిబంధనల ఉల్లంఘన

Total News2
Movie Updates0
Sources1
అమ్మే ఫస్ట్.. క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డిపై నారా లోకేశ్ ప్రశంసల జల్లు
Vaartha14 Jun 2026
అమ్మే ఫస్ట్.. క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డిపై నారా లోకేశ్ ప్రశంసల జల్లు

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టీమిండియా యువ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిపై రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రశంసల వర్షం కురిపించారు. అంతర్జాతీయ స్థాయిలో ఎంత ఎదిగినా కన్నతల్లికి

తిరుమలలో జనసేన కార్యకర్తల నిబంధనల ఉల్లంఘన
Vaartha14 Jun 2026
తిరుమలలో జనసేన కార్యకర్తల నిబంధనల ఉల్లంఘన

Tirumala: కలియుగ వైకుంఠమైన తిరుమల పవిత్రతకు భంగం కలిగించేలా కొందరు జనసేన కార్యకర్తలు, పవన్ కల్యాణ్ అభిమానులు ప్రదర్శించిన అత్యుత్సాహం ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీసింది. అత్యంత ఆధ్యాత్మిక వాతావరణం ఉండే శ్రీవారి ఆలయ పరిసరాల్లో నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ ప్రచారానికి పాల్పడటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొందరు రాజకీయ అభిమానులు తిరుమల శ్రీవారి ఆలయ సమీపంలో ‘పవన్ కల్యాణ్ అనే నేను’ అనే పుస్తకాన్ని పట్టుకుని వీడియో రీల్స్ చిత్రీకరించారు. ఆ పుస్తక ప్రమోషన్ కోసం వారు ఈ పని చేసినట్లు తెలుస్తోంది. ఆలయ పరిసరాల్లో మొబైల్ ఫోన్ల వాడకం, వీడియోలు తీయడంపై కఠిన నిషేధం ఉన్నప్పటికీ, వారు ఆ నిబంధనలను బేఖాతరు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు, శ్రీవారి భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. read also: Banakacherla Project: గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుకు రిటైర్డ్ ఇంజనీర్ల మద్దతు.. సీఎం చంద్రబాబుకు లేఖ తిరుమల కొండపై ఎలాంటి రాజకీయ ప్రచారాలు, కార్యకలాపాలు నిర్వహించకూడదని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) స్పష్టమైన నిబంధనలను అమలు చేస్తోంది. కొండపై రాజకీయ పార్టీల జెండాలు, ఫ్లెక్సీలు, బ్యానర్లు, నినాదాలు పూర్తిగా నిషేధం. చివరికి విఐపిలు దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడేటప్పుడు కూడా రాజకీయ వ్యాఖ్యలు చేయకూడదని టీటీడీ నిరంతరం సూచిస్తూనే ఉంటుంది. అంతేకాకుండా, ఆలయ మాడ వీధుల్లో సెల్‌ఫోన్ల వాడకం, ఫొటోలు లేదా వీడియోలు తీయడం నేరం. టీటీడీ విజిలెన్స్ సిబ్బంది నిరంతరం నిఘా ఉంచుతున్నప్పటికీ, కొందరు భక్తులు ఇలాంటి అతిక్రమణలకు పాల్పడటం భక్తులను ఆందోళనకు గురిచేస్తోంది. గతంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు టీటీడీ చట్టపరమైన చర్యలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఈ తాజా ఘటన భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచింది. రాజకీయ అభిమానాన్ని ప్రదర్శించడానికి పవిత్ర పుణ్యక్షేత్రాన్ని వేదికగా మార్చుకోవడం సరికాదని, దీనివల్ల ఆలయ విశిష్టత

త ర మలల జనస న క ర యకర తల న బ ధనల ఉల ల ఘన Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in