తండ్రి అంత్యక్రియలు.. మొజ్తాబా ఖమేనీ ఇకనైనా కనిపిస్తారా
Actor ProfilePolitician

తండ్రి అంత్యక్రియలు.. మొజ్తాబా ఖమేనీ ఇకనైనా కనిపిస్తారా

📊 Box Office Collections
Total News2
Movie Updates0
Sources1
ఎరేసి.. సహాయక బృందాలను ట్రాప్ చేసి పాక్ దాడులు
Eenadu15 Aug 2026
ఎరేసి.. సహాయక బృందాలను ట్రాప్ చేసి పాక్ దాడులు

Pakistan-Afghanistan| ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా-ఇరాన్ మధ్య శాంతికి తామే కారణమని ఎగిరిగంతులేస్తున్న పాకిస్థాన్‌.. పొరుగుదేశంతో మాత్రం తరచూ కయ్యానికి కాలుదువ్వుతోంది. జనావాసాలను లక్ష్యంగా చేసుకుంటూ

తండ్రి అంత్యక్రియలు.. మొజ్తాబా ఖమేనీ ఇకనైనా కనిపిస్తారా
Eenadu13 Aug 2026
తండ్రి అంత్యక్రియలు.. మొజ్తాబా ఖమేనీ ఇకనైనా కనిపిస్తారా

Mojtaba Khamenei | ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా-ఇజ్రాయెల్‌ దాడుల్లో మరణించిన ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి బహిరంగంగా కనిపించని అలీ ఖమేనీ కుమారుడు మొజ్తాబా ఖమేనీ (Mojtaba Khamenei)పైనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. ఈ కొత్త సుప్రీం లీడర్ తండ్రి అంత్యక్రియల్లో పాల్గొంటారా..? రహస్య ప్రాంతం నుంచి దేశాన్ని నడిపిస్తోన్న ఆయన ఇప్పుడైనా బహిరంగంగా కనిపిస్తారా..? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఫిబ్రవరి 28న ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని సుప్రీం లీడర్ ఉన్న కాంపౌండ్‌పై జరిగిన దాడుల్లో మొజ్తాబా గాయపడ్డారు. ఆయన కాలికి తీవ్ర గాయం కావడంతో పాటు ముఖమంతా కాలిపోయినట్లు ఆ దేశ మీడియా గతంలో వెల్లడించింది. మొజ్తాబా ఖమేనీ బతికే ఉన్నారని, ఆయనను రహస్య ప్రాంతంలో ఉంచి చికిత్స అందిస్తున్నారని పేర్కొంది. ఇజ్రాయెల్‌ నిఘాకు దొరకకుండా ఉండటం కోసం.. ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు కూడా ఆయనను కలిసేందుకు వెళ్లడం లేదని వార్తలు వచ్చాయి. పాలనా వ్యవహారాల్లో మాత్రం మొజ్తాబా పేరు వినిపిస్తోంది. ఆయన పేరిటే ప్రభుత్వ ప్రకటనలు వస్తున్నాయి. కానీ సుదీర్ఘకాలంగా మొజ్తాబా బహిరంగంగా కనిపించకపోవడంతో ఆయన ఆరోగ్యంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే వాటికి చెక్ పెట్టేలా అంత్యక్రియల్లో మొజ్తాబా కనిపిస్తారా..? అనే చర్చ మొదలైంది. అలీ ఖమేనీ మరణించిన తర్వాతే మొజ్తాబా (Mojtaba Khamenei)ను సుప్రీం లీడర్‌గా ఎన్నుకొన్న సంగతి తెలిసిందే. జులై 5 నుంచి 9 వరకు ఖమేనీ (Ayatollah Ali Khamenei) అంత్యక్రియల కార్యక్రమం జరగనుంది. తొలుత టెహ్రాన్‌, ఖోమ్‌ పట్టణాల్లో అంతిమ సంస్కారాలకు సంబంధించి కొన్ని కార్యక్రమాలు చేపట్టనున్నారు. 9వ తేదీన ఖమేనీ స్వస్థలం మషాద్‌లో ఆయనను ఖననం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక, ఈ కార్యక్రమానికి హాజరుకావాలని మోదీ (PM Modi)ని ఇరాన్‌ అధ్యక్షుడు మసౌద్‌ పెజెష్కియాన్‌ ఆహ్వానించినట్లు తెలుస్తోంది. దీనిని మన ప్రభుత్వం ధ్రువీకరించాల్సి