ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో బంగ్లాదేశ్ పీఎం సలహాదారుకు తనిఖీలు.. భారత రాయబారికి ఢాకా సమన్లు
Actor ProfilePolitician

ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో బంగ్లాదేశ్ పీఎం సలహాదారుకు తనిఖీలు.. భారత రాయబారికి ఢాకా సమన్లు

Total News1
Movie Updates0
Sources1
ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో బంగ్లాదేశ్ పీఎం సలహాదారుకు తనిఖీలు.. భారత రాయబారికి ఢాకా సమన్లు
Samayam Telugu16 Jun 2026
ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో బంగ్లాదేశ్ పీఎం సలహాదారుకు తనిఖీలు.. భారత రాయబారికి ఢాకా సమన్లు

Dhaka Summons Indian Envoy : భారత్, బంగ్లాదేశ్ దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగాయి. బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి తారిఖ్ రెహమాన్ అగ్రశ్రేణి సలహాదారు జహీద్ ఉర్ రెహమాన్‌ను ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారత ఇమ్మిగ్రేషన్ అధికారులు కొన్ని గంటల పాటు నిలిపి వేసి, విచారించడం ఇరుదేశాల మధ్య తీవ్ర వివాదానికి దారి తీసింది. ఈ ఘటనపై బంగ్లాదేశ్ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తమ దేశ అగ్రనేతకు జరిగిన అవమానానికి గానూ తీవ్ర నిరసన తెలియజేస్తూ.. ఢాకాలోని భారత డిప్యూటీ హైకమిషనర్ పవన్ బాధేకు బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ అత్యవసర సమన్లు జారీ చేసి వివరణ కోరింది.విమానాశ్రయంలో అసలేం జరిగిందంటే..?భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) ఆధ్వర్యంలో జరగనున్న ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ (ఐఓఆర్ఏ) సీనియర్ అధికారుల 28వ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు జహీద్ ఉర్ రెహమాన్ భారత్ ప్రభుత్వ అధికారిక ఆహ్వానంపై ఆదివారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. అయితే ఇమ్మిగ్రేషన్ తనిఖీల సమయంలో రొటీన్ సెక్యూరిటీ అలర్ట్ కింద ఆయన పేరు రావడంతో.. అధికారులు ఆయనను పక్కకు పిలిచారు. బంగ్లాదేశ్ అధికారిక వార్తా సంస్థ బీఎస్ఎస్ కథనం ప్రకారం.. దాదాపు రెండున్నర గంటల పాటు ఆయనను ఇమ్మిగ్రేషన్ విభాగంలోనే ఉంచి అధికారులు రకరకాల ప్రశ్నలు వేశారు.జహీద్ ఉర్ రెహమాన్ సాధారణ బంగ్లాదేశ్ పాస్‌పోర్ట్‌పై సార్క్ వీసాతో ప్రయాణిస్తున్నారని, ఆయన వద్ద దౌత్యపరమైన పాస్‌పోర్ట్ లేదని బంగ్లాదేశ్ మీడియా వెల్లడించింది. కాగా జహీద్ పొలిటికల్ కామెంటేటర్‌గా, బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వానికి తీవ్ర విమర్శకుడిగా గుర్తింపు పొందారు. సుదీర్ఘ నిరీక్షణ, విచారణ అనంతరం భారత అధికారులు ఆయనకు దేశంలోకి ప్రవేశించడానికి అనుమతి ఇచ్చినప్పటికీ.. జరిగిన అవమానంతో నొచ్చుకున్న జహీద్ తన పర్యటనను రద్దు చేసుకుని తక్షణమే స్వదేశానికి తిరుగు పయనమయ్యారు.తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన బంగ్లాదేశ్..ఈ ఘటనపై బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి డాక్టర్

ఢ ల ల ఎయ ర ప ర ట ల బ గ ల ద శ ప ఎ సలహ ద ర క తన ఖ ల భ రత ర యబ ర క ఢ క సమన ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in