జీవన సంగీతం
Actor ProfileCelebrity

జీవన సంగీతం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
జీవన సంగీతం
Sakshi23 Jul 2026
జీవన సంగీతం

‘కోట్లు సంపాదించిన వారు కాదు విజేత. కోటి సమస్యలు చుట్టుముట్టినా... చిరుదీపం వెలిగించైనా సరే, ధైర్యంగా వెలుగు దారుల్లో నడిచేవారే విజేత’ అంటారు ఒక రచయిత. ఈ మాటలు సంగీత రాజేకు అక్షరాలా సరిపోతాయి. ఆమెకు సంబంధించిన విశిష్ఠత... రచయిత్రి, డిజిటల్‌ క్రియేటర్, పాడ్‌కాస్టర్‌ కావడం కాదు. తల్లి చనిపోయిన దుఃఖం నుంచి తేరుకోక ముందే రెండుసార్లు క్యాన్సర్‌ బారిన పడింది. ‘నా జీవితానికి ఇక ఏం మిగిలింది!’ అనుకునే క్లిష్ట దశలో కూడా ఆమె పెదవులపై చిరునవ్వు చెరిగిపోలేదు. పూణేకు చెందిన సంగీత రాజే తొలి పుసక్తం ‘లైట్‌ బియాండ్‌ ది షాడోస్‌: ఏ ట్రూ స్టోరీ’ ఎంతోమంది రోగులకు «ధైర్యాన్ని ఇస్తోంది. స్వస్థత శక్తి సానుకూల దృక్పథంలోనే ఉందని గట్టిగా చెబుతోంది.... తల్లిదండ్రులను కోల్పోయిన దుఃఖం, శస్త్ర చికిత్సలు, సంవత్సరాల తరబడి నొప్పి... మరో వ్యక్తి అయితే... ‘ఈ జీవితం కంటే చావు నయం’ అనుకునేవారేమో. సంగీత రాజే మాత్రం ఎప్పుడూ అలా అనుకోలేదు. జీవనకాంక్ష ఆగిపోలేదు. అద్భుతమైన ఆత్మస్థైర్యంతో ఆశకు ఎప్పుడూ దగ్గరగానే ఉంది. బరువైన బాల్యం ‘పదకొండు సంవత్సరాల వయసులో మా నాన్నను కోల్పోయాను. మేము బతకడం కోసం అమ్మ మా ఇంటిని అమ్మేయాల్సి వచ్చింది. చాలా చిన్న వయసులోనే జీవితం ఒక పోరాటంగా మారింది. బాల్యం అకస్మాత్తుగా బరువుగా మారింది. ఆర్థిక ఇబ్బందులు దైనందిన జీవితంలో భాగమయ్యాయి’ అని గతాన్ని గుర్తు తెచ్చుకుంటుంది సంగీత. పదిహేనేళ్ల వయసులోనే సంగీతకు పెళ్లయింది. ఒక బిడ్డకు జన్మనిచ్చి ఆమె అక్క చనిపోయింది. అక్క బిడ్డకు అమ్మలేని లోటును తీర్చడానికి సంగీత చిన్న వయసులోనే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఆడిపాడే వయసు దుఃఖం, బాధ్యతలతో నిండిపోయింది. అయితే... మాతృత్వం అనేది సంగీత జీవితంలోకి కొంత సంతోషాన్ని తీసుకువచ్చింది. కానీ రెండు సంవత్సరాల తరువాత ఊహించని విషాదం చుట్టు ముట్టింది. అడుగడుగునా అనారోగ్య సమస్యలు ఇరవై రెండు ఏళ్ల వయసులో సంగీత రాజేకు

జ వన స గ త Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in