గేరు మార్చి... జోరు పెంచిన నివేదా పేతురాజ్
Actor ProfileActor

గేరు మార్చి... జోరు పెంచిన నివేదా పేతురాజ్

Total News1
Movie Updates0
Sources1
గేరు మార్చి... జోరు పెంచిన నివేదా పేతురాజ్
Chitrajyothy15 Jun 2026
గేరు మార్చి... జోరు పెంచిన నివేదా పేతురాజ్

నటిగా వైవిధ్యమైన పాత్రలు చేసిన నివేదా పేతురాజ్ స్ట్రాంగ్‌ కమ్ బ్యాక్‌ ఇచ్చింది. 'సింగ్ గీతం'లో కీలక పాత్ర పోషించిన నివేదా ఇప్పుడు ఇటు చిరంజీవి, అటు వెంకటేశ్‌ సినిమాల్లోనూ నటిస్తోంది. నటి నివేదా పేతురాజ్‌ (Nivetha Pethuraj) కు అవకాశాలు తగ్గిపోవడంతో... సినిమాలకు గుడ్ బై చెప్పేసి... హాయిగా పెళ్ళి చేసుకుని జీవితంతో స్థిరపడిపోతుందని అంతా అనుకున్నారు. అలానే ఆమె కూడా గత యేడాది ఆగస్టులో దుబాయ్‌ స్థిరపడిన మలయాళీ బిజినెస్ మ్యాన్‌ రాజ్ హిత్ ఇబ్రాన్ తో నిశ్చితార్థం జరిగినట్టుగా ఇన్ డైరెక్ట్ గా అభిమానులకు తెలియచేసింది. అంతా అనుకున్నట్టు జరిగితే అది జీవితం ఎందుకవుతుంది!? ఆ తర్వాత నాలుగు నెలలకే నివేదా ఎంగేజ్‌మెంట్‌ను రద్దు చేసుకుంది. ఆ విషయం కూడా ఫ్యాన్స్ కు ఇన్ డైరెక్ట్ గానే ఆమె తెలిపింది. ఇటు సినిమాలకు దూరమై... అటు వ్యక్తిగత జీవితంలో ఎదురుదెబ్బ తిన్న నివేదా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో కదా! అని అందరూ అనుకున్నారు. ఆ సమయంలో తన ఆలోచనలు ఎలా ఉన్నాయో స్వయంగా నివేదా పేతురాజ్ ఆదివారం తెలిపింది. జూన్‌ 12న విడుదలైన 'సింగ్ గీతం' (Sing Geetham) మూవీలో నివేదా పేతురాజ్ ఓ కీలక పాత్రను పోషించింది. అందులో ఆమె నటించిన విషయాన్ని మేకర్స్ గోప్యంగా ఉంచారు. నివేదా పేతురాజ్, రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాలో హీరో తల్లిదండ్రులుగా యాక్ట్ చేశారు. మరీ ముఖ్యంగా ఈ సినిమాకు ఆయువుపట్టు లాంటి పాత్ర ఆమెది. మూడేళ్ళ క్రితం 'దాస్ కా ధమ్కీ' చిత్రంలో నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత హారర్ మూవీ 'బూ'లో చేసింది. అది ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యింది. అలానే అప్పుడే 'పరువు' అనే వెబ్ సీరిస్ లో నటించింది. ఆ తర్వాత ఆమె తెరపై కనిపించిన సినిమా ఇదే! ఓ రకంగా 'సింగ్‌ గీతం' నివేదా పేతురాజ్ కు కమ్ బ్యాక్‌ మూవీ