
ఏపీ అభివృద్ధికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అండగా నిలుస్తున్నారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. తిరుపతి జిల్లాలోని ముక్కావారిపల్లెలో ‘వీబీ జీ రామ్ జీ’ పథకం ప్రారంభమైంది. తిరుపతి, జులై 2: ఏపీ


ఏపీ అభివృద్ధికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అండగా నిలుస్తున్నారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. తిరుపతి జిల్లాలోని ముక్కావారిపల్లెలో ‘వీబీ జీ రామ్ జీ’ పథకం ప్రారంభమైంది. తిరుపతి, జులై 2: ఏపీ

నేటి నుంచి గ్రామీణ ఉపాధి రంగంలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. గ్రామీణ పేద కుటుంబాలకు గౌరవప్రదమైన ఉపాధి కల్పించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమని చెప్పారు. తిరుపతి, జులై 2: నేటి నుంచి గ్రామీణ ఉపాధి రంగంలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. ఈరోజు(గురువారం) తిరుపతిలో జరిగిన బీజేపీ పదాధికారుల సమావేశంలో మాధవ్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ‘వీబీ-జీ రామ్ జీ’ పథకం ప్రారంభం కావడం హర్షణీయమన్నారు. గ్రామీణ పేద కుటుంబాలకు గౌరవప్రదమైన ఉపాధి కల్పించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమని చెప్పారు. స్థిరమైన ఆదాయ అవకాశాలను పెంచుతూ గ్రామీణ కుటుంబాల జీవనోపాధిని బలోపేతం చేస్తుందని తెలిపారు. గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి ఈ పథకం కీలకంగా దోహదపడుతుందని మాధవ్ అన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి స్వావలంబనకు బాటలు వేస్తుందన్నారు. ఉపాధితో పాటు అభివృద్ధిని అందించే సంక్షేమ - అభివృద్ధి దృక్పథానికి ఇది నిదర్శనమని అన్నారు. గ్రామీణ ప్రజల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మరోసారి నిరూపితమైందన్నారు. ఈ అవకాశాన్ని గ్రామీణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పీవీఎన్ మాధవ్ పిలుపునిచ్చారు. విద్యుత్ అంతరాయాల నివారణకు వేగవంతంగా చర్యలు: మంత్రి గొట్టిపాటి రవికుమార్ జగన్ తీరు అందరికీ తెలుసు: సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి