గ్యాస్ కష్టాలు తీరాలంటే
Actor ProfilePolitician

గ్యాస్ కష్టాలు తీరాలంటే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
గ్యాస్ కష్టాలు తీరాలంటే
Eenadu26 Jun 2026
గ్యాస్ కష్టాలు తీరాలంటే

దేశవ్యాప్తంగా ఎల్‌పీజీ కనెక్షన్ల సంఖ్య 33 కోట్లు దాటింది. విస్తృతమవుతున్న పట్టణీకరణ, జనాభా పెరుగుదల తదితరాలతో నానాటికీ ఎల్‌పీజీకి డిమాండ్‌ అధికమవుతోంది. 2023-24లో దేశీయంగా వంటగ్యాస్‌ వినియోగం రోజుకు 81వేల టన్నులుంటే, ఆపై రెండేళ్లలో అది 91వేల టన్నులకు పెరిగింది. రాబోయే పాతికేళ్లలో ఈ గిరాకీ ఇంతకు రెట్టింపవుతుందని అంటున్నారు. ఇప్పటికే మనకు కావాల్సిన ఎల్‌పీజీలో 60శాతాన్ని దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. అందుకోసం ఏటా రూ.లక్షల కోట్ల విదేశ మారకద్రవ్యం ఖర్చవుతోంది. పైగా అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పుడు గ్యాస్‌ సరఫరాలు సన్నగిల్లి ద్రవ్యోల్బణం కట్టుతప్పుతోంది. మరోవైపు గడిచిన పదేళ్లలో ఎల్‌పీజీ ధరలు 60శాతానికి పైగా పెరిగాయి. ఇటీవలి అమెరికా-ఇరాన్‌ యుద్ధ సమయంలో అవి పదిశాతం మేర అధికమయ్యాయి. ఈ ధరాభారాలను భరించలేక పల్లెపట్టుల్లో ప్రజలు మళ్లీ కట్టెలపొయ్యిలవైపు మళ్లే ప్రమాదముంది. దానివల్ల జనారోగ్యానికి, పర్యావరణానికీ హాని జరుగుతుంది. కాబట్టి జనభారత ప్రయోజనాలూ ఇంధనభద్రతల దృష్ట్యా ఎల్‌పీజీకి ప్రత్యామ్నాయాలను విరివిగా వాడుకలోకి తేవడం అత్యావశ్యకం. భారత్‌ అంటేనే వ్యవసాయం, పాడికి పేరెన్నికగన్న దేశం. ఆసేతు హిమాచలం 20 కోట్ల పశుసంపద ఉంది. వాటి వ్యర్థాలు, మిగిలిపోయిన పంట అవశేషాలతో పాటు ఇళ్లలో వృథాగా పడేసే ఆహారపదార్థాలు బయోగ్యాస్‌ తయారీకి విలువైన వనరులవుతాయి. పట్టణాల నుంచి ఏటా పుట్టుకొస్తున్న 6.2 కోట్ల టన్నుల చెత్తనూ ఇందుకు వాడుకోవచ్చు. ఈ క్రమంలో వెలువడే స్లర్రీ పంటలకు సహజ ఎరువుగా ఉపయోగపడుతుంది. తత్ఫలితంగా కృత్రిమ ఎరువుల దిగుమతుల భారం దిగివస్తుంది. అయితే, 2022 నాటికి ఇండియాలో 0.3శాతం కుటుంబాలే వంటకు బయోగ్యాస్‌ను వాడుతున్నాయి. ఈ పరిస్థితిని మెరుగుపరచడానికి, గృహస్థాయి నుంచి వాణిజ్య ప్రాతిపదికన ఉత్పత్తి చేయడం వరకు బయోగ్యాస్‌కు ఊతమిచ్చేందుకు కేంద్రం ప్రత్యేక పథకాలు తెచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో సీఎన్‌జీ, పైప్డ్‌ నేచురల్‌ గ్యాస్‌లకు మూడు శాతంమేర కంప్రెస్డ్‌ బయోగ్యాస్‌ను కలపాలని, క్రమంగా దాన్ని పెంచాలని నిశ్చయించింది. ఇవన్నీ బాగానే ఉన్నా- ప్రారంభ ఖర్చులు ఎక్కువగా ఉండటం

గ య స కష ట ల త ర ల ట Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in