క్రేజ్ వేరు
Actor ProfileActor

క్రేజ్ వేరు

Total News2
Movie Updates0
Sources2
క్రేజ్ వేరు, సక్సెస్ వేరు - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్
Telugu Cinema13 Jun 2026
క్రేజ్ వేరు, సక్సెస్ వేరు - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

సినిమా ఇండస్ట్రీలో గెలుపోటములు సహజం, కానీ ఈ మధ్యకాలంలో పరాజయాలు వస్తే చాలు నటీనటులపై సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్ జరుగుతోంది. హీరోయిన్ పూజా హెగ్డే (Pooja Hegde) కూడా గత కొంతకాలంగా ఇలాంటి నెగెటివిటీని ఎదుర్కొంటోంది. వరుసగా క్రేజీ ప్రాజెక్టులు చేస్తున్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఆశించిన రిజల్ట్స్ రాకపోవడంతో కొంతమంది ఆమెను టార్గెట్ చేశారు. ఇటీవల వచ్చిన హిందీ చిత్రం ‘హై జవానీ ఇష్క్ హోనా హై’ ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో, ఆమెను ‘ఐరన్ లెగ్’ అంటూ దారుణంగా ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పటివరకు ఈ విమర్శలపై సైలెంట్‌గా ఉన్న పూజా, తాజాగా వీటన్నింటికీ గట్టి కౌంటర్ ఇచ్చింది. సోషల్ మీడియాలో ఉండే క్రేజ్‌కు, థియేటర్లలో వచ్చే వసూళ్లకు అస్సలు ముడిపెట్టలేమని పూజా చాలా ప్రాక్టికల్‌గా మాట్లాడింది. “నాకు ఇన్‌స్టాగ్రామ్, ఇతర వేదికలపై 30 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. అంత మాత్రాన థియేటర్లలో 30 కోట్ల టికెట్లు తెగుతాయని అనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. సోషల్ మీడియా ఫాలోయింగ్ అనేది కేవలం ఒక నంబర్ మాత్రమే” ఇలా తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టే ప్రయత్నం చేసింది పూజాహెగ్డే. నెగెటివిటీని తాను అస్సలు పట్టించుకోనని, సోషల్ మీడియాలో కనిపించే అకౌంట్లలో చాలావరకు ఫేక్ అని అంటోంది పూజా పాప. ఇలాంటి ట్రోలింగ్స్ వల్ల తన కెరీర్ ఆగిపోదని కూడా క్లారిటీ ఇస్తోంది

నమ్మినవారే మోసం చేస్తే?... సీట్ ఎడ్జ్ ట్విస్టులతో మెప్పిస్తున్న మలయాళ ఇన్వెస్టిగేషన్ మూవీ
Samayam Telugu13 Jun 2026
నమ్మినవారే మోసం చేస్తే?... సీట్ ఎడ్జ్ ట్విస్టులతో మెప్పిస్తున్న మలయాళ ఇన్వెస్టిగేషన్ మూవీ

క్రైమ్ ఇన్వెస్టిగేషన్, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలకు బాక్సాఫీస్ వద్ద, అలాగే డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో ఉండే క్రేజ్ వేరు. ముఖ్యంగా పక్కా పోలీస్ ఇన్వెస్టిగేషన్ కథాంశాలతో వచ్చే మలయాళ చిత్రాలను