అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు మళ్లీ భారీగా తగ్గాయి. ఇవాళ స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 39 డాలర్ల మేర పడిపోయి 4000 డాలర్ల దిగువకు చేరింది. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ ఔన్సు రేటు 3983 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 1.19 శాతం మేర తగ్గింది. ప్రస్తుతం వెండి ఔన్స్ రేటు 57 డాలర్ల వద్ద అమ్ముడవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో పసిడి రేట్లు మళ్లీ తగ్గాయి. వరుసగా రెండో రోజూ భారీగా పతనమయ్యాయి. 24 క్యారెట్ల బంగారం రేటు రెండ్రోజుల్లో రూ.3800 వరకు పడిపోయింది. ఈరోజు 10 గ్రాముల బంగారం రేటు రూ.1800 మేర పడిపోవడంతో తులం బంగారం రూ.1,40,130 వద్దకు దిగివచ్చింది. అలాగే 22 క్యారెట్ల పసిడి రేటు ఈరోజు మరో రూ.1650 మేర పడిపోయింది. దీంతో తులం బంగారం రేటు రూ.1,28,450 వద్దకు దిగివచ్చింది. బంగారంతో పాటు వెండి రేటు సైతం దిగివస్తుందని అంచనా వేసినా అందుకు భిన్నంగా స్థిరంగా కొనసాగుతోంది. హైదరాబాద్ మార్కెట్లో వెండి రేటు గత నాలుగు రోజులుగా స్థిరంగానే ఉంది. ఈరోజు కిలో వెండి రేటు రూ.2,45,000 మార్క్ వద్ద ట్రేడవుతోంది. హైదరాబాద్ సహా దక్షిణ భారత్‌లోని ప్రముఖ జువెలరీల్లో ఒకటిన లలితా జువెలరీల్లోనూ ఈరోజు బంగారం ధరలు తగ్గాయి. 22 క్యారెట్ల ఆభరణాల గోల్డ్ రేటు 1 గ్రాముకు రూ.165 మేర తగ్గింది. దీంతో గ్రాము గోల్డ్ రేటు రూ.12,845 వద్ద అమ్ముడవుతోంది. ఇక తులం బంగారం చూసుకుంటే రూ.1,28,450 వద్ద ఉంది. రచయిత గురించిబండ తిరుపతిబండ తిరుపతి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. 2023లో సమయంలో చేరిన తిరుపతి.. బిజినెస్ రంగానికి సంబంధించి తాజా వార్తలతో పాటు పర్సనల్ ఫైనాన్స్, పెట్టుబడులు, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ న్యూస్, బంగారం వెండి ధరలపై
Actor ProfileCelebrity
కుప్పకూలుతున్న బంగారం ధర.. వరుసగా రెండోరోజూ భారీ పతనం.. ఈరోజు గోల్డ్ రేటు ఎంతంటే
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•20 Aug 2026
కుప్పకూలుతున్న బంగారం ధర.. వరుసగా రెండోరోజూ భారీ పతనం.. ఈరోజు గోల్డ్ రేటు ఎంతంటే