కాంగ్రెస్ లో విలీనం
Actor ProfilePolitician

కాంగ్రెస్ లో విలీనం

Total News3
Movie Updates0
Sources2
ఆరెస్సెస్ ఈవెంట్ కు ముగ్గురు వీసీలు..! సారీ చెప్పాలన్న సీఎం
Oneindia Telugu15 Jun 2026
ఆరెస్సెస్ ఈవెంట్ కు ముగ్గురు వీసీలు..! సారీ చెప్పాలన్న సీఎం

కేరళలో తాజాగా జరిగిన ఓ ఆరెస్సెస్ ఈవెంట్ కు రాష్ట్రంలోని మూడు యూనివర్శిటీల వీసీలు (ఉపకులపతులు) హాజరు కావడం చర్చనీయాంశమైంది. వీసీలుగా ఉన్న వారు ఆరెస్సెస్ ఈవెంట్ కు హాజరు కావడంపై అక్కడి యూడీఎఫ్ సర్కార్

ఢిల్లీకి తృణమూల్ పంచాయతీ..! అభిషేక్ వర్సెస్ రెబెల్స్
Oneindia Telugu14 Jun 2026
ఢిల్లీకి తృణమూల్ పంచాయతీ..! అభిషేక్ వర్సెస్ రెబెల్స్

బెంగాల్లో గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత విపక్ష తృణమూల్ కాంగ్రెస్ (TMC) లో తలెత్తిన తిరుగుబాటు ఇప్పుడు ఢిల్లీకి చేరింది. ఇప్పటికే అసెంబ్లీలో మమతా బెనర్జీ సూచించిన ఎమ్మెల్యే శోభన్ దేవ్ ఛటర్జీకి

కాంగ్రెస్ లో విలీనంపై క్లారిటీ ఇచ్చిన సుప్రియా సూలే
Vaartha13 Jun 2026
కాంగ్రెస్ లో విలీనంపై క్లారిటీ ఇచ్చిన సుప్రియా సూలే

Supriya Sule: మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఎన్‌సీపీ (శరద్ పవార్ వర్గం) విలీన వార్తలపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ సుప్రియా సూలే స్పష్టతనిచ్చారు. తమ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయబోతున్నారంటూ వస్తున్న వార్తలను ఆమె పూర్తిగా కొట్టిపారేశారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ నుండి తమకు ఎలాంటి విలీన ప్రతిపాదనలు రాలేదని, తమ వైపు నుండి కూడా అలాంటి ప్రయత్నాలేవీ జరగడం లేదని ఆమె తేల్చి చెప్పారు. అసలు ఈ తరహా ప్రచారం ఎక్కడి నుండి పుట్టుకొచ్చిందో కూడా తనకు అర్థం కావడం లేదన్నారు. పార్టీ అధినేత శరద్ పవార్‌కు సైతం ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం నుండి ఎటువంటి సమాచారం అందలేదని స్పష్టం చేశారు. Read also: UP Crime: ప్రేమ పెళ్లి చేసుకుందని కన్న కూతురిపై కత్తితో దాడి.. యువతి మృతి ఇటీవల కాలంలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మధ్య జరిగిన సమావేశం తర్వాత జాతీయ రాజకీయాల్లో విలీనాలపై రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. దీనిపై సుప్రియా సూలే స్పందిస్తూ.. ఆ ఇద్దరు నేతల మధ్య జరిగిన వ్యక్తిగత భేటీలో ఏయే అంశాలు చర్చకు వచ్చాయనేది తనకు తెలియదన్నారు. ఆ సమావేశంలో వారు మాత్రమే ఉన్నందున, అక్కడ విలీన ప్రక్రియల గురించి మాట్లాడారా లేదా అనే దానిపై తనకు ఎలాంటి సమాచారం లేదని పేర్కొన్నారు. ప్రస్తుత తరుణంలో రాజకీయ సమీకరణాల కంటే దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపైనే దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సుప్రియా సూలే అభిప్రాయపడ్డారు. దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, అవినీతి మరియు ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ (NEET) పరీక్ష పేపర్ లీకేజీల వంటి అంశాలు విద్యార్థుల, సాధారణ ప్రజల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు రాజకీయ లబ్ధి