ఓటీటీలోకి పెద్ది’.. ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కావొచ్చంటే.. ఎక్స్ టెండెడ్ వెర్షన్ తో మేకర్స్ సర్ ప్రైజ్
Actor ProfileActor

ఓటీటీలోకి పెద్ది’.. ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కావొచ్చంటే.. ఎక్స్ టెండెడ్ వెర్షన్ తో మేకర్స్ సర్ ప్రైజ్

Total News1
Movie Updates0
Sources1
ఓటీటీలోకి పెద్ది’.. ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కావొచ్చంటే.. ఎక్స్ టెండెడ్ వెర్షన్ తో మేకర్స్ సర్ ప్రైజ్
Samayam Telugu17 Jun 2026
ఓటీటీలోకి పెద్ది’.. ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కావొచ్చంటే.. ఎక్స్ టెండెడ్ వెర్షన్ తో మేకర్స్ సర్ ప్రైజ్

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ వన్ మ్యాన్ షోతో థియేటర్లలో రచ్చ లేపుతోన్న చిత్రం ‘పెద్ది’. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. 1980ల నాటి గ్రామీణ ఆంధ్రప్రదేశ్ నేపథ్యం, అక్కడి ప్రజల ఆత్మగౌరవ పోరాటం, క్రీడల చుట్టూ సాగే భావోద్వేగమైన కథకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే రూ. 300 కోట్ల క్లబ్‌ను దాటేసిన ఈ చిత్రం.. మరిన్ని రికార్డుల దిశగా దూసుకుపోతోంది. థియేటర్లలో ఈ రేంజ్ రికార్డులు తిరగరాస్తున్న తరుణంలో, ఈ సినిమా డిజిటల్ విడుదలపై సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన వార్త తెగ వైరల్ అవుతోంది. ఇది ఓటీటీ ప్రియులకు పూనకాలు తెప్పించే అప్‌డేట్ అనే చెప్పాలి.* నెట్టింట 'బాడీ కౌంట్' రచ్చ... ట్రోలర్స్‌ని మరింత రెచ్చగొడుతోన్న విష్ణుప్రియ ప్రముఖ అంతర్జాతీయ డిజిటల్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ‘పెద్ది’ సినిమా ఓటీటీ హక్కులను సొంతం చేసుకుంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం వంటి అన్ని ప్రధాన భాషల డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఏకంగా రూ. 105 కోట్ల భారీ మొత్తాన్ని చెల్లించి డీల్ కుదుర్చుకున్నట్లు ఇండస్ట్రీ టాక్. ప్రస్తుతం థియేటర్లలో కలెక్షన్ల జోరు బలంగా ఉండటంతో.. అన్నీ తగ్గాకే డిజిటల్ రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ చిత్రం జూలై మధ్యలో లేదా ఆగస్టు మొదటి వారంలో ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశం ఉంది. నిజానికి, దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ సినిమా కోసం దాదాపు మూడున్నర గంటలకు పైగా ఫుటేజ్‌ను షూట్ చేశారు. అయితే, థియేటర్లలో రన్‌టైమ్ ఎక్కువైతే ప్రేక్షకులు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో మొదట 3 గంటల 9 నిమిషాల నిడివితోనే రిలీజ్ చేశారు. ఈ క్రమంలో సినిమాలోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు కత్తిరింపులకు గురయ్యాయి. ఇటీవల ఇందులో అప్పల సూరి పాత్రలో నటించిన