ఊచకోతకు శ్రీకారం చుట్టిన పవర్ స్టార్
Actor ProfileActor

ఊచకోతకు శ్రీకారం చుట్టిన పవర్ స్టార్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఊచకోతకు శ్రీకారం చుట్టిన పవర్ స్టార్
NTV Telugu19 Jul 2026
ఊచకోతకు శ్రీకారం చుట్టిన పవర్ స్టార్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో వచ్చిన స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ OG. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆకలి తీర్చిన ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతోందని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటించారు మేకర్స్. "తుఫాను రావడానికి ముందు.. అక్కడ కొంత నిశ్శబ్దం ఉంటుంది. గంభీర యొక్క అన్‌టోల్డ్ స్టోరీ ఇప్పుడు విప్పబడటానికి సిద్ధంగా ఉంది" అని క్యాప్షన్ ను జతచేస్తూ OG 2 అనౌన్స్ చేసారు మేకర్స్. మొదటి భాగంలో కేవలం పవన్ కళ్యాణ్ స్వాగ్ మరియు స్టైల్ తో మ్యాజిక్ చేసిన సుజీత్ ఈసారి కథపై మరింత దృష్టి పెట్టారు. ఈ ప్రీక్వెల్ స్టోరీలో సుజీత్ కొత్త క్యారెక్టర్లను పరిచయం చేయబోతున్నారు. జపాన్‌లో ‘ఓజాస్ గంభీర’ సృష్టించిన అసలు విద్వంసం ఏమిటి? అతను గ్యాంగ్‌స్టర్‌గా ఎలా ఎదిగాడు? అనే కోణంలో ఈ సినిమా ఉండబోతోంది. దర్శకుడు సుజీత్, పవన్ కళ్యాణ్ కాంబోలో రాబోతున్న ఈ సినిమా కేవలం పార్ట్ 2తో సరిపెట్టకుండా OG యూనివర్స్ ను తీసుకురాబోతున్నారు. OG 2’ నిర్మాణ బాధ్యతల నుండి DVV ఎంటర్‌టైన్‌మెంట్స్ తప్పుకుంది. ఈ క్రేజీ యూనివర్స్ ప్రాజెక్ట్‌ను పవన్ కళ్యాణ్ సొంత నిర్మాణ సంస్థ 'పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్' పతాకంపై నిర్మించబోతున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతమే అందించబోతున్నాడు. OG యూనివర్స్ అప్‌డేట్‌తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల్లో పూనకాలు మొదలయ్యాయి. మరి సుజీత్ ఈ సారి సృష్టించబోయే విధ్వంసం ఎలా ఉండబోతుందో జస్ట్ వెయిట్ అండ్ వాచ్