
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో వచ్చిన స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ OG. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆకలి తీర్చిన ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతోందని గత కొంతకాలంగా వార్తలు...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో వచ్చిన స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ OG. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆకలి తీర్చిన ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతోందని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటించారు మేకర్స్. "తుఫాను రావడానికి ముందు.. అక్కడ కొంత నిశ్శబ్దం ఉంటుంది. గంభీర యొక్క అన్టోల్డ్ స్టోరీ ఇప్పుడు విప్పబడటానికి సిద్ధంగా ఉంది" అని క్యాప్షన్ ను జతచేస్తూ OG 2 అనౌన్స్ చేసారు మేకర్స్.
మొదటి భాగంలో కేవలం పవన్ కళ్యాణ్ స్వాగ్ మరియు స్టైల్ తో మ్యాజిక్ చేసిన సుజీత్ ఈసారి కథపై మరింత దృష్టి పెట్టారు. ఈ ప్రీక్వెల్ స్టోరీలో సుజీత్ కొత్త క్యారెక్టర్లను పరిచయం చేయబోతున్నారు. జపాన్లో ‘ఓజాస్ గంభీర’ సృష్టించిన అసలు విద్వంసం ఏమిటి? అతను గ్యాంగ్స్టర్గా ఎలా ఎదిగాడు? అనే కోణంలో ఈ సినిమా ఉండబోతోంది. దర్శకుడు సుజీత్, పవన్ కళ్యాణ్ కాంబోలో రాబోతున్న ఈ సినిమా కేవలం పార్ట్ 2తో సరిపెట్టకుండా OG యూనివర్స్ ను తీసుకురాబోతున్నారు. OG 2’ నిర్మాణ బాధ్యతల నుండి DVV ఎంటర్టైన్మెంట్స్ తప్పుకుంది. ఈ క్రేజీ యూనివర్స్ ప్రాజెక్ట్ను పవన్ కళ్యాణ్ సొంత నిర్మాణ సంస్థ 'పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్' పతాకంపై నిర్మించబోతున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతమే అందించబోతున్నాడు. OG యూనివర్స్ అప్డేట్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల్లో పూనకాలు మొదలయ్యాయి. మరి సుజీత్ ఈ సారి సృష్టించబోయే విధ్వంసం ఎలా ఉండబోతుందో జస్ట్ వెయిట్ అండ్ వాచ్.
Before the storm arrives... there's a moment of silence.The untold story of Gambheera is ready to unfold.Director @SujeethSign and @PawanKalyan Garu reunite under Pawan Kalyan Creative Works to expand the #OGUniverse saga ������#OG2 Pawan Kalyan Creative Works (@PKCWoffl) June 25, 2026