
నవీన్ పోలిశెట్టి (Naveen polishetty) ఎక్స్ వేదికగా ఆసక్తికర వీడియో షేర్ చేశారు. కథా బలమున్న కథలతో గుర్తింపు తెచ్చుకున్న ఆయన తదుపరి చిత్రం గురించి అప్‌డేట్ ఇచ్చారు. నవీన్ పోలిశెట్టి (Naveen


నవీన్ పోలిశెట్టి (Naveen polishetty) ఎక్స్ వేదికగా ఆసక్తికర వీడియో షేర్ చేశారు. కథా బలమున్న కథలతో గుర్తింపు తెచ్చుకున్న ఆయన తదుపరి చిత్రం గురించి అప్‌డేట్ ఇచ్చారు. నవీన్ పోలిశెట్టి (Naveen

'మా ఇంటి బంగారం' యాక్షన్ సీక్వెన్స్ కోసం సమంత పడ్డ కష్టం.. ప్రిపరేషన్స్ కు సంబంధించిన మేకర్స్ ఓ వీడియో విడుదల చేశారు. సమంత (Samantha) కథానాయికగా నందినిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మా ఇంటి

హీరోయిన్ నాగదుర్గ మాకు 15 కండీషన్స్ పెట్టింది. తెలుగమ్మాయి ఒక సినిమా చేస్తుంటే.. ఏం చేయగలను, ఏం చేయలేను అని ఎంత క్లారిటీగా ఉంటుందనేది నాగదుర్గతో మాట్లాడిన తర్వాత అర్థమైందని అన్నారు నిర్మాత బన్నీ వాసు. డైరెక్టర్ సుకుమార్ (Director Sukumar) నిర్మాణ సంస్థ సుకుమార్ రైటింగ్స్, యంగ్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ (Bunny Vas) నిర్మాణ సంస్థ బన్నీ వాస్ వర్క్స్.. సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘ఇడుపు కాయితం’ (Idupu Kayitham). ప్రియదర్శి (Priyadarshi) హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో తెలంగాణ ఫోక్ సాంగ్స్ ద్వారా పేరు తెచ్చుకున్న నటి నాగదుర్గ హీరోయిన్‌గా నటిస్తోంది. తెలంగాణ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఎంటర్‌టైనింగ్ డ్రామాగా ఈ సినిమాను యువ దర్శకుడు వంశీరెడ్డి దొండపాటి (Vamsi Reddy Dondapati) రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా హైదరాబాద్‌లో జరిగిన పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో నిర్మాత బన్నీ వాసు.. హీరోయిన్ నాగదుర్గ (Nagadurga) గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘‘చాలా మంచి కథతో ఈ సినిమా చేస్తున్నాం. సబ్ టైటిల్స్‌తో బీహార్‌లో వేసినా అక్కడ ప్రేక్షకులు కూడా చూసేంత గొప్ప చిత్రమిది. మన అందరి ఇళ్లలో ఒక కామన్ ప్రాబ్లమ్ ఉంటుంది. అదేంటనేది పెళ్లయిన వారికి బాగా తెలుసు. ఈ సినిమా రిలీజ్ అయ్యాక అమ్మాయి అయితే వాళ్ల అత్తామామను తీసుకుని థియేటర్‌కు వెళ్లండి.. అబ్బాయి అయితే వాళ్ల అత్తామామను తీసుకుని విడిగా థియేటర్‌కు వెళ్లండి. బయటకు వచ్చాక మీ అత్త మీ చేతులు పట్టుకుంటుంది. అల్లుడి చేతులు మామగారు పట్టుకుంటారు. అంతవరకు ఈ కథను చెప్పగలను. ఈ కథ వినగానే ఎంత బిజీగా ఉన్నా సరే.. మేము చేస్తామంటూ నటీనటులందరూ ముందుకు వచ్చారు. ఈ కథే వీళ్లందరినీ ప్రాజెక్ట్ లోకి తీసుకొచ్చింది. జమ్మికుంట నుంచి వచ్చాడు దర్శకుడు వంశీ. నేను ఆ ఊరు వెళ్లలేదు గానీ ఆయన కథ చెబుతుంటే ఆ