
నవీన్ పోలిశెట్టి (Naveen polishetty) ఎక్స్ వేదికగా ఆసక్తికర వీడియో షేర్ చేశారు. కథా బలమున్న కథలతో గుర్తింపు తెచ్చుకున్న ఆయన తదుపరి చిత్రం గురించి అప్డేట్ ఇచ్చారు.
నవీన్ పోలిశెట్టి (Naveen polishetty) ఎక్స్ వేదికగా ఆసక్తికర వీడియో షేర్ చేశారు. కథా బలమున్న కథలతో గుర్తింపు తెచ్చుకున్న ఆయన తదుపరి చిత్రం గురించి అప్డేట్ ఇచ్చారు. ఈ ఏడాది ‘సంక్రాంతికి అనగనగా ఒక రాజు’ సినిమాతో విజయం అందుకున్నారు. తాజాగా ఆయన పాన్ ఇండియా దర్శకులు లోకేష్ కనగరాజ్, రిషబ్ శెట్టి, సుకుమార్, ప్రశాంత్ నీల్, హరీష్ శంకర్‌తోపాటు నిర్మాత నవీన్ యెర్నేనితో కలిసి ఉన్న వీడియోను షేర్ చేశారు. హలో గయ్స్ అంటూ ఒక్కో దర్శకుడు సాధించిన కలెక్షన్ల గురించి చెబుతూ నా లైఫ్‌లో కాస్ట్లీ ఫ్రేమ్ ఇది అంటూ సరదాగా చేసిన వీడియోను అభిమానులతో పంచుకున్నారు. పాన్ ఇండియా స్థాయి దర్శకులంతా ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం అభిమానులకు మంచి కిక్ ఇచ్చింది. ప్రస్తుతం వీరంతా హైదరాబాద్‌లోనే ఉన్నారు. (pan India reel)
లోకేష్ అల్లు అర్జున్‌తో మీటింగ్ కోసం హైదరాబాద్ వచ్చారు. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ‘డ్రాగన్’ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో చేస్తున్నారు. రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’ చిత్రీకరణలో ఉన్నారు. సుకుమార్, హరీష్ శంకర్ ఎలాగే ఇక్కడే ఉన్నారు. వీరంతా మైత్రి నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసిన స్పెషల్ పార్టీలో పాల్గొన్నారు. నవీన్ పోలిశెట్టి కూడా ఆ పార్టీలో పాల్గొవడంతో ఈ వీడియో చేశారు నవీన్. అలాగే కొత్త చిత్రం కూడా లోడ్ అవుతుందని పోస్ట్‌లో తెలిపారు.
ఈ అమ్మాయికి పిలిచి అవకాశం ఇస్తే.. 15 కండీషన్లు పెట్టింది: బన్నీ వాసు
Tollywood: పర్శంటేజ్ పై ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ షరతులు!
లీగల్ వివాదంలో ప్రభాస్ ‘స్పిరిట్’.. టైటిల్ మార్చాల్సిందేనా?