ఈడీకి కేశినేని నాని సవివరాలు అందజేత
Actor ProfilePolitician

ఈడీకి కేశినేని నాని సవివరాలు అందజేత

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఈడీకి కేశినేని నాని సవివరాలు అందజేత
Oneindia Telugu5 Jul 2026
ఈడీకి కేశినేని నాని సవివరాలు అందజేత

ఏపీ రాజకీయాల్లో మరో వివాదం రేగింది. పోలవరం కుడి ప్రధాన కాలువ మట్టి తవ్వకాలలో దాదాపు 350 కోట్ల రూపాయల భారీ కుంభకోణం జరిగిందని మాజీ ఎంపీ కేశినేని నాని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ అక్రమ మట్టి తవ్వకాలు, బినామీ నెట్‌వర్క్, మనీలాండరింగ్ కార్యకలాపాలపై తక్షణమే విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కు లేఖ రాశారు. మూడు పేజీల సుదీర్ఘ లేఖ ఇది.పోలవరం కుడి ప్రధాన కాలువతో పాటు బుడమేరు డైవర్షన్ ఛానల్ పరిధిలో జరిగిన ఈ భారీ కుంభకోణం వెనుక విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ప్రమేయం ఉందని ఆరోపించారు నాని. ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూరుస్తూ, ప్రజా వనరులను నిలువునా దోచుకుంటున్నారని మండిపడ్డారు. ఈ సిండికేట్‌పై పీఎంఎల్‌ఏ కింద దర్యాప్తు జరపాలని కోరారు. ఈ భారీ మట్టి దోపిడీ వెనుక బలమైన రాజకీయ, అధికారుల అండదండలు ఉన్నాయని ఆరోపించారు.ప్రధాన కాలువ కట్టలను ధ్వంసం చేస్తూ సాగిన ఈ దందా విలువ దాదాపు 350 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని కేశినేని నాని అంచనా వేశారు. ఈ అక్రమ నిధుల మళ్లింపు వెనుక ఉన్న అసలైన లబ్ధిదారులను, వారి అనుచరులను చట్టం ముందుకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. మైనింగ్, నీటిపారుదల శాఖల నుంచి తొలుత ఖాన్ అనే వ్యక్తి 167.040 కిలోమీటర్ల మైలు రాయి వద్ద కేవలం 5,000 క్యూబిక్ మీటర్ల మట్టిని మాత్రమే తవ్వుకోవడానికి అనుమతి తీసుకున్నారని, దీన్ని అడ్డుపెట్టుకుని భారీ ఎత్తున లూటీ చేయడానికి ఒక వ్యవస్థీకృత సిండికేట్ ఏర్పాటయిందని ఆయన లేఖలో స్పష్టం చేశారు.ఇందులో మాజీ కార్పొరేటర్ కాకు మల్లికార్జున్‌, ఎంపీ కేశినేని చిన్ని జోక్యం చేసుకోవడంతో పరిమిత అనుమతి కాస్తా అపరిమితమైన దోపిడీ సామ్రాజ్యంగా మారిందని ఆరోపించారు. ఏకంగా 2,00,000 క్యూబిక్ మీటర్లకు పైగా మట్టిని అక్రమంగా తవ్వడం వల్ల పోలవరం కుడి కాలువ గట్లను పూర్తిగా దెబ్బతీన్నదని లేఖలో