
పుణెలోని చారిత్రాత్మక లోహగడ్ కోటలో జరిగిన కేతన్ అగర్వాల్ హత్య కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపింది. కొద్ది రోజుల్లో పెళ్లి జరగనున్న ఆ యువతి, తన ప్రియుడి సహాయంతో కేతన్‌ను నేరుగా కొండ అంచు నుంచి లోయలోకి తోసేసింది. ట్రెకింగ్ సమయంలో మొదట ప్రమాదంగా భావించగా.. పోలీసుల విచారణ సమయంలో అది దారుణమైన కుట్ర అని తెలిసింది. ప్రేమ పేరుతో ద్రోహం, ప్రేమలో పొంచి ఉన్న భయంకరమైన ప్రమాదం గురించి ఇప్పుడు ప్రతిచోట చర్చ జరుగుతుంది. సినిమా పరిశ్రమలో ఇలాంటి క్రైమ్ కథాంశాలు.. ట్రయాంగిల్ ప్రేమ కథలు చాలానే వచ్చాయి. ఇప్పుడు అలాంటి ప్రేమ, నమ్మకం, ద్రోహం వంటి అంశాలతో కూడిన సినిమాలు ఏంటో తెలుసుకుందామా. మనం మాట్లాడుకుంటున్న సినిమా పేరు కర్జ్... 1980లో విడుదలైన ఈ సినిమా సుభాష్ ఘాయ్ రూపొందించారు. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. పునర్జన్మ, ప్రతీకారం నేపథ్యంలో సాగుతుంది. ఇందులో రవి వర్మ కామిని అనే అత్యంత దురాశగల అమ్మాయితో ప్రేమలో పడతాడు. అయితే, పెళ్ళి జరిగిన కొద్ది రోజులకే, కామిని ఊటీ ఘాట్‌ల వద్ద రవి కారును ఒక లోయలోకి తోసేసి, అతని ఆస్తి మొత్తాన్ని తన పేరు మీదకు మార్చుకుంటుంది. ప్రస్తుతం ఈ సినిమా జీ5లో అందుబాటులో ఉంది. ఎక్కువమంది చదివినవి : Cinema : ఇదెక్కడి డిమాండ్ రా బాబూ.. ప్రేమ, ద్రోహం, ప్రతీకారం.. ఓటీటీలో దూసుకుపోతున్న వెబ్ సిరీస్.. అలాగే హసీనా దిల్ రూబా.. తాప్సీ పన్ను, విక్రాంత్ మాస్సే నటించిన ఈ సినిమా సైతం ప్రేమ, నమ్మకం వంటి అంశాలతో ఉంటుంది. నిశ్శబ్దంగా ఉండే అబ్బాయిని పెళ్లి చేసుకున్న రాణి, పెళ్లి తర్వాత తన భర్త కజిన్‌తో ప్రేమలో పడుతుంది. ఈ కథ చివరి మలుపు చాలా ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఇంట్లో అగ్రి ప్రమాదం జరగడం వల్ల తన భర్త చనిపోయాడని చెబుతుంది రాణి. కానీ పోలీసుల విచారణలో అసలు