
పుణెలోని చారిత్రాత్మక లోహగడ్ కోటలో జరిగిన కేతన్ అగర్వాల్ హత్య కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపింది. కొద్ది రోజుల్లో పెళ్లి జరగనున్న ఆ యువతి, తన ప్రియుడి సహాయంతో కేతన్‌ను నేరుగా కొండ అంచు నుంచి లోయలోకి...
పుణెలోని చారిత్రాత్మక లోహగడ్ కోటలో జరిగిన కేతన్ అగర్వాల్ హత్య కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపింది. కొద్ది రోజుల్లో పెళ్లి జరగనున్న ఆ యువతి, తన ప్రియుడి సహాయంతో కేతన్‌ను నేరుగా కొండ అంచు నుంచి లోయలోకి తోసేసింది. ట్రెకింగ్ సమయంలో మొదట ప్రమాదంగా భావించగా.. పోలీసుల విచారణ సమయంలో అది దారుణమైన కుట్ర అని తెలిసింది. ప్రేమ పేరుతో ద్రోహం, ప్రేమలో పొంచి ఉన్న భయంకరమైన ప్రమాదం గురించి ఇప్పుడు ప్రతిచోట చర్చ జరుగుతుంది. సినిమా పరిశ్రమలో ఇలాంటి క్రైమ్ కథాంశాలు.. ట్రయాంగిల్ ప్రేమ కథలు చాలానే వచ్చాయి. ఇప్పుడు అలాంటి ప్రేమ, నమ్మకం, ద్రోహం వంటి అంశాలతో కూడిన సినిమాలు ఏంటో తెలుసుకుందామా. మనం మాట్లాడుకుంటున్న సినిమా పేరు కర్జ్... 1980లో విడుదలైన ఈ సినిమా సుభాష్ ఘాయ్ రూపొందించారు. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. పునర్జన్మ, ప్రతీకారం నేపథ్యంలో సాగుతుంది. ఇందులో రవి వర్మ కామిని అనే అత్యంత దురాశగల అమ్మాయితో ప్రేమలో పడతాడు. అయితే, పెళ్ళి జరిగిన కొద్ది రోజులకే, కామిని ఊటీ ఘాట్ల వద్ద రవి కారును ఒక లోయలోకి తోసేసి, అతని ఆస్తి మొత్తాన్ని తన పేరు మీదకు మార్చుకుంటుంది. ప్రస్తుతం ఈ సినిమా జీ5లో అందుబాటులో ఉంది.
ఎక్కువమంది చదివినవి : Cinema : ఇదెక్కడి డిమాండ్ రా బాబూ.. ప్రేమ, ద్రోహం, ప్రతీకారం.. ఓటీటీలో దూసుకుపోతున్న వెబ్ సిరీస్..
అలాగే హసీనా దిల్ రూబా.. తాప్సీ పన్ను, విక్రాంత్ మాస్సే నటించిన ఈ సినిమా సైతం ప్రేమ, నమ్మకం వంటి అంశాలతో ఉంటుంది. నిశ్శబ్దంగా ఉండే అబ్బాయిని పెళ్లి చేసుకున్న రాణి, పెళ్లి తర్వాత తన భర్త కజిన్‌తో ప్రేమలో పడుతుంది. ఈ కథ చివరి మలుపు చాలా ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఇంట్లో అగ్రి ప్రమాదం జరగడం వల్ల తన భర్త చనిపోయాడని చెబుతుంది రాణి. కానీ పోలీసుల విచారణలో అసలు కథ బయటపడుతుంది. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో అందుబాటులో ఉంది.
ఎక్కువమంది చదివినవి : Cinema : నిజమైన సంఘటనల ఆధారంగా సిరీస్.. ఓటీటీలో ట్రెండింగ్‌లో ఉన్న వెబ్ సిరీస్..
గాన్ గర్ల్ - జియో హాట్‌స్టార్ ఓటీటీలో అందుబాటులో ఉంది. ఇది ఒక శక్తివంతమైన హాలీవుడ్ సైకలాజికల్ థ్రిల్లర్ డ్రామా. వారి ఐదవ వివాహ వార్షికోత్సవం రోజున నిక్ ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, అతని భార్య అమీ కనిపించకుండా పోతుంది. ఇంట్లో జరిగిన విధ్వంసాన్ని చూసి, నిక్ తన విద్యార్థినులలో ఒకరితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని పోలీసులు అనుమానిస్తారు. కానీ క్లైమాక్స్‌లో బయటపడే నిజం ప్రేక్షకులను దిగ్భ్రాంతికి గురి చేస్తుంది.
ఎక్కువమంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరో.. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్.. కానీ తెలుగులో అట్టర్ ప్లాప్.. కారణం ఇదే..
అంధాధున్ - జియో హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఆయుష్మాన్ ఖురానా, టబు , రాధికా ఆప్టే నటించిన ఈ చిత్రం బాలీవుడ్లో ఉత్తమ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో, టబు పాత్ర తన ప్రియుడితో పాటు సొంత భర్తను కూడా దారుణంగా హత్య చేసి, ఆ కేసులో ఒక అంధుడిని ఇరికిస్తుంది. దీనిని తెలుగులో మాస్ట్రో పేరుతో రీమేక్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమాలు మరోసారి ఓటీటీలో ట్రెండ్ అవుతున్నాయి.
ఎక్కువమంది చదివినవి : Rajanna Movie : రాజన్న సినిమాకు నాకు ఇచ్చిన రెమ్యునరేషన్ అంతే.. టాలీవుడ్ నటుడు..