అమ్మే ఫస్ట్.. క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి
Actor ProfilePolitician

అమ్మే ఫస్ట్.. క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి

Total News3
Movie Updates0
Sources2
పేస్ బుక్ అకౌంట్ బ్లాక్
Vaartha14 Jun 2026
పేస్ బుక్ అకౌంట్ బ్లాక్

YCP : ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన రాజకీయ పార్టీలలో ఒకటైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) అధికారిక ఫేస్‌బుక్ (FB) ఖాతా హఠాత్తుగా నిలిచిపోవడం రాజకీయ మరియు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది

అమ్మే ఫస్ట్.. క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డిపై నారా లోకేశ్ ప్రశంసల జల్లు
Vaartha14 Jun 2026
అమ్మే ఫస్ట్.. క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డిపై నారా లోకేశ్ ప్రశంసల జల్లు

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టీమిండియా యువ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిపై రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రశంసల వర్షం కురిపించారు. అంతర్జాతీయ స్థాయిలో ఎంత ఎదిగినా కన్నతల్లికి నితీశ్ ఇచ్చిన గౌరవాన్ని మెచ్చుకుంటూ లోకేశ్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. Read also: Tirumala: తిరుమలలో జనసేన కార్యకర్తల నిబంధనల ఉల్లంఘన ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో నితీశ్ కుమార్ రెడ్డి అద్భుతమైన బౌలింగ్‌తో రాణించాడు. ప్రమాదకరంగా మారిన సెంచరీ హీరో రహ్మనుల్లా గుర్బాజ్‌తో సహా రెండు కీలక వికెట్లు పడగొట్టి టీమిండియా విజయంలో భాగమయ్యాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత నితీశ్ మీడియా సమావేశంలో మాట్లాడుతుండగా ఆయన మొబైల్ ఫోన్ మోగింది. అది తన తల్లి నుంచి వచ్చిన కాల్ అని గమనించిన నితీశ్.. ఏమాత్రం తడుముకోకుండా మీడియా ప్రతినిధులకు క్షమాపణలు చెప్పారు. వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి “అమ్మా, నేను ప్రెస్ మీట్‌లో ఉన్నాను.. మళ్లీ కాల్ చేస్తాను” అని ఎంతో సున్నితంగా చెప్పి ఫోన్ పెట్టేసి, తిరిగి ప్రెస్ మీట్‌ను కొనసాగించారు. లైవ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో నితీశ్ ప్రవర్తించిన తీరుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై మంత్రి నారా లోకేశ్ తన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ ఆ వీడియోను షేర్ చేశారు. “క్రికెట్ అయినా, ప్రెస్ కాన్ఫరెన్స్ అయినా.. ఎప్పుడైనా అమ్మే ఫస్ట్. వెల్ ప్లేయడ్ నితీశ్!” అంటూ నితీశ్ కుమార్ రెడ్డి సంస్కారాన్ని కొనియాడారు. అంతర్జాతీయ క్రికెట్ వేదికపై దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ, ఎంతో ఒత్తిడితో కూడిన మీడియా సమావేశంలో ఉన్నప్పటికీ.. తల్లి పట్ల నితీశ్ చూపిన అమితమైన గౌరవం భేషనిపిస్తోంది. ఆటతోనే కాకుండా తన ఉన్నతమైన వ్యక్తిత్వంతో, సంస్కారంతో నితీశ్ కోట్లాది మంది అభిమానుల మనసులను గెలుచుకున్నాడంటూ నెటిజన్లు సైతం ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. Tirumala: తిరుమలలో జనసేన కార్యకర్తల

అమ్మే ఫస్ట్.. క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డిపై మంత్రి నారా లోకేశ్ ప్రశంసలు
AP7AM14 Jun 2026
అమ్మే ఫస్ట్.. క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డిపై మంత్రి నారా లోకేశ్ ప్రశంసలు

టీమిండియా యువ క్రికెటర్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డిపై రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రెస్ కాన్ఫరెన్స్ వంటి కీలకమైన సందర్భంలోనూ తన తల్లికి నితీశ్ ఇచ్చిన గౌరవాన్ని మెచ్చుకుంటూ లోకేశ్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.వివరాల్లోకి వెళితే, ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన తొలి వన్డేలో నితీశ్ కుమార్ రెడ్డి అద్భుతంగా రాణించి, సెంచరీ హీరో రహ్మనుల్లా గుర్బాజ్‌తో సహా 2 కీలక వికెట్లు పడగొట్టాడు. మ్యాచ్ అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతుండగా ఫోన్ మోగింది. అది తన తల్లి నుంచి వచ్చిన కాల్ అని గమనించిన నితీశ్, మీడియాకు క్షమాపణ చెప్పి, "అమ్మా, నేను మళ్లీ కాల్ చేస్తాను" అని సున్నితంగా చెప్పి ఫోన్ పెట్టేశారు. అనంతరం ప్రెస్ మీట్‌ను కొనసాగించారు.ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా, దీనిపై మంత్రి నారా లోకేశ్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. "క్రికెట్ అయినా, ప్రెస్ కాన్ఫరెన్స్ అయినా.. అమ్మే ఫస్ట్. వెల్ ప్లేయడ్, నితీశ్!" అని పేర్కొంటూ ఆ వీడియోను ఆయన పంచుకున్నారు.అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నప్పటికీ, తల్లి పట్ల నితీశ్ చూపిన గౌరవం, సంస్కారం అందరినీ ఆకట్టుకుంటోంది. ఆటతోనే కాకుండా, తన ప్రవర్తనతో కూడా నితీశ్ అభిమానుల మనసులను గెలుచుకుంటున్నాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు