వెండితెరపై ఒక పాత్ర కనిపిస్తున్నప్పుడు.. అది కేవలం అభినయంలా అనిపిస్తే అతడు నటుడు అవుతాడు. కానీ, ఆ పాత్రలో ఒక సాధారణ మనిషి సజీవంగా కదిలాడు అనే భ్రమ కల్పిస్తే అతడు కళాకారుడు అవుతాడు. ఇలాగే ప్రస్తుతం
అనిల్ రావిపూడి నాకు అందుకే మళ్లీ ఛాన్స్ ఇవ్వడం లేదేమో
టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ , రష్మిక మందానా వెండితెరపైనే కాకుండా నిజ జీవితంలోనూ రియల్ హీరోలనిపించుకున్నారు. ఇటీవలే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన ఈ జంట, తమ ఉదారతతో ఎందరికో ఆదర్శంగా నిలిచారు
టాలీవుడ్లో తనదైన నటన, విలక్షణమైన పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ఐశ్వర్య రాజేష్ . గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా వైవిధ్యమైన కంటెంట్ ఆధారిత చిత్రాలను ఎంచుకుంటూ టాలీవుడ్లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. తాజాగా ఈ బ్యూటీ నటించిన విలేజ్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఓ సుకుమారి’ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను చిత్రబృందం శనివారం విడుదల చేసింది. ఈ టీజర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా ఐశ్వర్య రాజేష్ పాత్రికేయులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆమె తన కెరీర్, హిట్స్, అలాగే సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తమిళంలో స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న ఐశ్వర్య రాజేష్.. 2019లో వచ్చిన ‘కౌసల్య కృష్ణమూర్తి’ అనే మహిళా ప్రాధాన్య చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఇందులో మహిళా క్రికెటర్‌గా ఆమె చూపించిన నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ సరసన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రంలో 'సువర్ణ' అనే ఒక సాదాసీదా మధ్యతరగతి గృహిణి పాత్రలో ఒదిగిపోయి తెలుగు వారి హృదయాలను గెలుచుకున్నారు. సాయిధరమ్ తేజ్ హీరోగా వచ్చిన ‘రిపబ్లిక్’ మూవీలో కీలక పాత్రలో నటించింది. గతేడాది విక్టరీ వెంకటేష్ సరసన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంలో భాగ్యలక్ష్మిగా నటించి, తన కెరీర్లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్‌బస్టర్‌ను దక్కించుకుంది.* రిటైర్డ్ ఐపీఎస్ భార్య హత్య కేసుపై ఆర్జీవీ కన్ను.. సరికొత్త క్రైమ్ డ్రామాకు స్కెచ్! ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా అంతటి భారీ విజయం సాధించడంలో ఐశ్వర్య రాజేష్ పాత్ర కూడా కీలకమని చాలామంది ప్రశంసించారు. అయితే ఆ తర్వాత అనిల్ రావిపూడి తన సినిమాల్లో ఐశ్వర్యకు ఎందుకు అవకాశం ఇవ్వలేదు? అనే ప్రశ్న ఈ ఈవెంట్లో ఎదురైంది. దీనికి ఐశ్వర్య రాజేష్ తనదైన శైలిలో స్పందిస్తూ.. "మీ దగ్గర అనిల్ గారి నెంబర్ ఉందా? ఉంటే వెంటనే ఫోన్ చేసి అడుగుదాం" అంటూ సరదాగా