
నాగర్‌కర్నూల్‌లో ఈ నెల 10వ తేదీన జరిగిన హోటల్ నిర్వాహకుడి హత్య కేసు మిస్టరీ వీడింది. వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు నిర్ధారించారు. భార్యనే ప్లాన్ చేసి ప్రియుడితో హత్య చేయించినట్లుగా దర్యాప్తులో తేల్చారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్‌లోని రామ్‌నగర్ కాలనీకి చెందిన కరీం అనే వ్యక్తి హోటల్ నిర్వహిస్తున్నాడు. తమ్ముడు వరసయ్యే గౌస్ పాషాను హోటల్లో పనికి పెట్టుకున్నాడు. హోటల్లో పనిచేస్తున్న సమయంలోనే కరీం భార్య సలీమాతో గౌస్ పాషా వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే భర్తను అడ్డు తొలగించుకోవాలని భావించిన సలీమా.. తనపై అనుమానం రాకుండా తాను ఇంట్లో లేనప్పుడు భర్తను చంపాలని ప్రియుడు గౌస్‌కు చెప్పింది. ఈ కుట్రలో భాగంగా సలీమా.. ఈ నెల 9వ తేదీన నెల్లూరు దర్గాకు వెళ్లింది. ఆమె ఇచ్చిన సమాచారంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న కరీమ్‌ను కత్తితో పొడిచి గౌస్ పాషా హత్య చేశాడు.






