
ఎన్జీవోస్ కాలనీ : హనుమకొండ నగరంలో భారీగా వర్షం కురుస్తోంది. ఉదయం ప్రారంభమైన వర్షం ఏకధాటిగా కురుస్తుండటంతో నగరంలోని పలు కాలనీలు జలమయం అయ్యాయి. ప్రధాన రోడ్లపై వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. హనుమకొండ చౌరస్తా బస్టాండ్, బాలసముద్రం, ఎన్జీవోస్ కాలనీ రోడ్డు, నైమ్ నగర్, నక్కలగుట్ట, కాజీపేట ప్రధాన రహదారులపై నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అంబేడ్కర్ కూడలి నుంచి ఎన్జీవోస్ కాలనీకి వెళ్లే ప్రధాన రోడ్డుపై వరద నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. మరోవైపు మురుగు కాలువలు ఉప్పొంగే ప్రవహిస్తున్నాయి. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.



