
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ విడుదలకు ముందడుగు పడింది. వశిష్ఠ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ చిత్ర ఓటీటీ హక్కులను ప్రముఖ డిజిటల్ సంస్థ భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. విజువల్ ఎఫెక్ట్స్ పనుల్లో నాణ్యత కోసం చిత్రబృందం ప్రత్యేక సమయం కేటాయించడంతో విడుదల పలుమార్లు ఆలస్యమైంది. తాజా ఓటీటీ ఒప్పందంతో థియేట్రికల్ విడుదలకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. త్రిష, ఆషికా రంగనాథ్ కథానాయికలుగా నటిస్తున్న ఈ పాన్-ఇండియా విజువల్ వండర్ థియేట్రికల్ రిలీజ్ తేదీని చిత్ర మేకర్స్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.




