

Sushmita Konidela : మెగాస్టార్ చిరంజీవి కూతురు, సినీ నిర్మాత సుస్మిత కొణిదెలకు అరుదైన గౌరవం దక్కింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ట్రస్ట్ బోర్డుకు ఆమె ప్రత్యేక ఆహ్వానితురాలిగా నియమితులయ్యారు. దేవాదాయ శాఖ కార్యదర్శి కన్నబాబు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
ఆలయానికి వచ్చే భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించడం, ఆలయ అభివృద్ధి కార్యక్రమాలపై సూచనలు చేయడం, ప్రత్యేక ఉత్సవాల నిర్వహణలో భాగస్వామ్యం కావడం వంటి అంశాల్లో సుస్మిత కొణిదెల తన సేవలను అందించనున్నారు.
Vishwanath and Sons OTT : ఓటీటీలోకి బ్లాక్ బాస్టర్ మూవీ.. సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
సుస్మిత నిర్మాతగా రాణిస్తోంది. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై చిత్రాలను నిర్మిస్తోంది. ఇటీవల తన తండ్రి చిరంజీవితో నిర్మించిన మన శంకర వర ప్రసాద్ గారు మూవీతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
ఇదిలా ఉంటే.. తెలంగాణలోని యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పాలకమండలి సభ్యురాలిగా చిరంజీవి భార్య కొణిదెల సురేఖ సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే.



