
విశ్వంభర (Vishwambhara)
చిరంజీవి, వశిష్ట కాంబినేషన్లో తెరకెక్కిన ‘విశ్వంభర’ రిలీజ్‌పై మరోసారి ఆసక్తికరమైన చర్చ మొదలైంది. షూటింగ్ పూర్తై చాలాకాలం అవుతున్నా విడుదలకు నోచుకోని ఈ సినిమాకు ఓటీటీ డీల్ అడ్డంకిగా ఉందనే ప్రచారం జరిగింది. ఇప్పుడు సోనీ లివ్‌తో డిజిటల్ రైట్స్ డీల్ తుది దశకు చేరుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో సంక్రాంతికి ‘విశ్వంభర’ను తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయని టాక్. అదే జరిగితే చిరంజీవి ‘కాకా’ విడుదల సమ్మర్‌కు మారే అవకాశం ఉందని సమాచారం.




