
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న పీరియాడిక్ యాక్షన్ చిత్రం ‘ఫౌజీ’ మరోసారి వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో ఈ సినిమాను 2026 డిసెంబర్ 3న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే 1940ల నాటి భారీ విజువల్స్, క్లిష్టమైన వీఎఫ్ఎక్స్, పెండింగ్ షూటింగ్ పనుల దృష్ట్యా డిసెంబర్ నాటికి అవుట్‌పుట్ సిద్ధమవడం కష్టంగా మారింది. సంక్రాంతి పోటీ, మార్చిలో ప్రభాస్ నటించే ‘స్పిరిట్’ విడుదల ఉండటంతో, ‘ఫౌజీ’ని 2027 ఫిబ్రవరిలో థియేటర్లలోకి తీసుకురావాలని నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌తో ఓటీటీ ఒప్పందాలపై చర్చలు జరుగుతుండగా, త్వరలోనే మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా కొత్త తేదీని ప్రకటించనుంది.
Tags:#spirit
Found this helpful?