
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ధర్మన్’ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న అశ్వత్ మారిముత్తు తాజాగా మూడో సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ధర్మన్’ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న అశ్వత్ మారిముత్తు తాజాగా మూడో షెడ్యూల్ ప్రారంభమైంది అని ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన తన ఎక్స్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. షూటింగ్ సెట్స్ నుండి విడుదల చేసిన బిహైండ్-ది-సీన్స్ వీడియోలో రజనీకాంత్, నటి రాశి ఖన్నాతో కలిసి ముచ్చటిస్తూ కనిపించారు. 'ధర్మన్ మూడో షెడ్యూల్ కోసం మళ్లీ తలైవర్‌తో కలిశాను' అని ఆయన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది, అభిమానులు దీనిపై ఆసక్తిగా స్పందిస్తున్నారు. ఇటీవల సెప్టెంబర్ 4న ఈ చిత్రానికి సంబంధించిన రెండో షెడ్యూల్ విజయవంతంగా ముగిసింది. ఆ సమయంలో, చిత్ర నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, రజనీకాంత్ ఒక సీనియర్ మెడికల్ ఫ్యాకల్టీగా జూనియర్ డాక్టర్లకు పాఠాలు చెబుతున్న సన్నివేశాలను చూపిస్తూ ఒక వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోకు అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. కమల్ హాసన్ స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రంపై తమిళనాడు మరియు తెలుగు రాష్ట్రాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘ధర్మమే వెల్లుమ్’ అనే ట్యాగ్‌లైన్‌తో కమల్ ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించారు. ఈ చిత్రంలో రజనీకాంత్ వైద్యుడిగా నటించనున్నారు, అయితే ఆయన పాత్ర సమాజంలోని నేరస్థులను శిక్షించే శక్తివంతమైన పాత్రగా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. గతంలో విడుదలైన టైటిల్ పోస్టర్లో రజనీకాంత్ ఆపరేషన్ థియేటర్లో స్కాల్పెల్ చేతిలో పట్టుకుని, ఒక రౌడీ మృతదేహంపై కాలు వేసి ఉన్న లుక్ సినిమాపై ఉత్కంఠను మరింత పెంచింది. ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు, అలాగే నికేత్ బొమ్మి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీతలైన అన్బరివ్ ద్వయం స్టంట్స్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. కమల్ హాసన్ మరియు ఆర్. మహేంద్రన్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. చిత్ర యూనిట్ వరుస షెడ్యూళ్లతో సినిమాను వేగంగా పూర్తి చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది.




