
KTR | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకాల్లో ఒకటి కంటి వెలుగు.ఈ ముఖ్యమైన పథకాన్ని కొనసాగిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలో కంటి వెలుగు పథకం కింద ఉచిత కళ్లద్దాలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం చేసినా చేయకపోయినా మన రాజన్న సిరిసిల్ల జిల్లాకు మాత్రం కొంతమంది దోస్తులను పట్టుకొని మనమైనా చేయాలని సవేరి బాయ్సాబ్ను పట్టుకున్నా. ఆయన ముందుకొచ్చి తప్పకుండా చేస్తా.. మీకు కావాల్సినదంతా ఏర్పాటు చేస్తా.. వైద్యులను పంపిస్తా అన్నడు. చెప్పిన ప్రకారం మనం అక్క్డడనో ఇక్కడనో కాదు.. మనమే ఏర్పాటు చేసిన వీర్పపల్లి మండలం. మన ప్రభుత్వంలో గతంలో ఏర్పాటు చేసుకున్న మండలం..ఇక్కడనే మొదలుపెట్టాలని చెప్పి వీర్నపల్లిలో మొదలుపెట్టినమన్నారు.
నాలుగు రోజులు వీర్నపల్లి, గర్జనపల్లిలో క్యాంపులు పెట్టారు. 5000 మందికిపైగా స్క్రీనింగ్ టెస్టులు చేశారు. అందులో 1350 మందికి అందులో కొంతమంది పిల్లలు కూడా ఉన్నారు. 250 మంది పిల్లలున్నారు.. 1100 మంది పెద్దవాళ్లున్నారు. మొత్తం 1371 మందికి అద్దాలు ఇవ్వబోతున్నాం. అందులో 171మందికి కంటిలో శుక్లాలు రావడం, ఇతర సమస్యలు రావడం వల్ల వాళ్లకు ఆపరేషన్ అవసరమవుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. ఆ ఆపరేషన్‌కు కూడా మనమెక్కిడికో పోవాల్సిన అవసరం లేదు.. మన సిరిసిల్లలోనే గతంలో మనమే రూ.6 కోట్ల రూపాయలతో ఎల్వీ ప్రసాద్ కంటి దవాఖానా పెట్టాం. వీర్నపల్లి నుంచి బండి వస్తది. మిమ్మల్ని ఎక్కించుకుపోతది.. సిరిసిల్లలో వైద్యం చేయించి మళ్లీ మీ ఇంటిదగ్గర దిగబెట్టిపోయేట్టు ఆ సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్నం. 171 మంది కంటి ఆపరేషన్ చేయించే బాధ్యత కూడా నాదేనని కేటీఆర్ అన్నారు. వీర్నపల్లిలో ప్రారంభించుకున్నం.. తర్వాత ఆగన్న చెప్పినట్టు మొత్తం మన నియోజకవర్గంలోని నాలుగు మండలాలు, మున్సిపాలిటీల్లో కూడా ఈ కార్యక్రమం చేస్తం. ఆ తర్వాత పక్కనే ఉన్న వేములవాడ నియోజకవర్గంలో కూడా కార్యక్రమం చేసుకుందామన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా మొత్తం కార్యక్రమం చేయిద్దామని కేటీఆర్ స్పష్టం చేశారు. జిల్లా మొత్తం మంచిగా చేసుకుంటే అప్పుడన్నా ప్రభుత్వానికి సోయి వచ్చి వాళ్లు మొదలుపెడితే మంచిదే. వాళ్లు మొదలపెట్టి మీరు చేసేది ఏంది.. మేం చేస్తం. ప్రభుత్వం ప్రజల సొమ్ముతో చేస్తా అంటే ఫర్వాలేదన్నారు. కానీ ప్రభుత్వం చేసినా చేయకపోయినా మనం మాత్రం మన నియోజకవర్గంలో, మన జిల్లాలో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకుందామని పిలుపునిచ్చారు.
సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలో కంటి వెలుగు పథకం కింద ఉచిత కళ్లద్దాలు పంపిణీ చేసిన కేటీఆర్ — Telugu Scribe (@TeluguScribe) August 12, 2026 కాంగ్రెస్ ప్రభుత్వం ఆపేసిన కంటి వెలుగు పథకాన్ని కొనసాగించాలని సిరిసిల్ల జిల్లాలో ఉచిత కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేశాము ఆపరేషన్ అవసరం ఉన్న 171 మందికి ఉచితంగా ఆపరేషన్ చేయించే బాధ్యత నాది మనం చేస్తున్నది చూసి సోయి వచ్చి ప్రభుత్వం ఈ పథకం మొదలుపెడితే మంచిది — Telugu Scribe (@TeluguScribe) August 12, 2026 Ketogenic Diet | కీటోజెనిక్ డైట్ అంటే ఏమిటి.. భారతీయులకు ఇది సెట్ అవుతుందా..?
Amit Shah | అన్నింటికీ సమాధానం ఇస్తానన్న అమిత్ షా.. భయం లేదన్న రాహుల్ గాంధీ FCRA Bill: జేపీసీకి ఎఫ్సీఆర్ఏ బిల్లు.. లోక్‌సభలో తీర్మానం పాస్
Recommended for you
Found this helpful?
Share this story with your network










