
Chaminda Vaas : ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో విదేశీ కోచ్‌లు చాలామందిని చూశాం. ఈ లీగ్‌లో ఆటగాడిగా అడుగుపెట్టి.. అనంతరం కోచ్‌గా వచ్చిన వాళ్లూ ఉన్నారు. ఈసారి శ్రీలంక వెటరన్ చమిందా వాస్(Chaminda Vaas) ఈ మెగా ఈవెంట్లో కోచ్‌గా అడుగుపెట్టనున్నాడు. ఒకప్పుడు పేస్ సంచలనమైన వాస్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా సేవందించనున్నాడు. ఐపీఎల్ 2027తో అతడు ఈ మెగా ఈవెంట్లో అరంగేట్రం చేయనున్నాడు. ఢిల్లీ ప్రధాన కోచ్ సౌరవ్ గంగూలీ, బ్యాటింగ్ కోచ్ యువరాజ్ సింగ్‌లతో కలిసి పని చేయనున్న అతడు యువ క్రికెటర్ల బౌలింగ్‌ను సానబెట్టనున్నాడు. ఐపీఎల్ 20వ సీజన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ సన్నాహకాలు మొదలెట్టింది. తొలి టైటిల్ కోసం నిరీక్షిస్తున్న ఢిల్లీ బౌలింగ్ కోచ్‌గా చమిందా వాస్‌ను తీసుకుందని సమచారం. వచ్చే ఎడిషన్ ముందే ఢిల్లీ కోచింగ్ బృందంలో వాస్ చేరే అవకాశముంది. క్రిక్‌బజ్ కథనం ప్రకారం.. ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ 2027 సీజన్‌తో కోచ్‌గా ఐపీఎల్లో అడుగుపెట్టనున్నాడు. భారత మాజీ లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా కూడా ఢిల్లీ కోచింగ్ దళంలో భాగం కానున్నాడు. అయితే.. ఈ విషయాన్ని ఢిల్లీ యాజమాన్యం అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. Former Sri Lanka fast bowler Chaminda Vaas is set to make his IPL coaching debut in 2027 with Delhi Capitals appointing him as their bowling coach. – Cricinfo pic.twitter.com/KlllO7UJFW — Sri Lanka Tweet 🇱🇰 (@SriLankaTweet) September 14, 2026 ఐపీఎల్ ఆరంభ సీజన్లో దక్కన్ చార్జర్స్(Deccan Chargers)కు ఆడాడీ మాజీ పేసర్. వీడ్కోలు అనంతరం కోచింగ్ కెరీర్‌పై దృష్టి సారించిన వాస్.. సొంత జట్టుకు పనిచేశాడు. ఆపై 2016లో న్యూజిలాండ్ పురుషుల జట్టుకు, ఐర్లాండ్ టీమ్‌కు కన్సల్టంట్గా సేవలందించాడు. ఫాస్ట్ బౌలింగ్ కన్సల్టంట్, అకాడమీ మెంటర్‌గా అనుభవం అతడి సొంతం. ఒకప్పుడు లంక ప్రధాన పేసర్‌గా ఇరగదీసిన వాస్ టెస్టుల్లో 355 వికెట్లు, వన్డేల్లో 400 వికెట్లు తీశాడు. ఐపీఎల్లో 13 మ్యాచులే ఆడిన వాస్ 18 వికెట్లు పడగొట్టాడు. Cricinfo has learned that Chaminda Vaas is set to make his IPL coaching debut in 2027 🆕 Full story: https://t.co/q7rM4gkqqQ pic.twitter.com/WnI2KnRHku — Cricinfo (@cricinfo) September 14, 2026





