నేడు కరీంనగర్‌లో కేంద్రీకృత వంటశాల ప్రారంభం అల్పాహారం తయారీకి కేంద్రీకృత వంటశాలలో ఏర్పాటు చేసిన యంత్రాలు న్యూస్‌టుడే, కరీంనగర్‌ విద్యావిభాగం, కరీంనగర్‌ పట్టణం: విద్యార్థుల హాజరుశాతాన్ని పెంచడంతోపాటు వారికి పోషకాలతో కూడిన అల్పాహారం కోసం సీఎం బ్రేక్‌ఫాస్ట్‌ పథకాన్ని తెచ్చారు. ఇందు కోసం హరే కృష్ణ మూవ్‌మెంట్‌ ఛారిటబుల్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన కేంద్రీకృత వంటశాలకు మంత్రి పొన్నం ప్రభాకర్‌ బుధవారం ప్రారంభించనున్నారు. ఇప్పటికే కొన్నిరోజులుగా చిగురుమామిడి మండలంలోని సర్కారు బడులు, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులకు అల్పాహారాన్ని సరఫరా చేస్తున్నారు. చిగురుమామిడిలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సరఫరాను మంగళవారం మొదలుపెట్టారు. కరీంనగర్‌ రూరల్, సైదాపూర్‌ మండలాల ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలకు బుధవారం నుంచి అల్పాహారం పంపిణీని ప్రారంభించనున్నారు. కరీంనగర్, హుస్నాబాద్, చొప్పదండి నియోజవర్గాల్లో 13 మండలాల పరిధిలోని 502 ప్రభుత్వ పాఠశాలలు, 9 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో సీఎం బ్రేక్‌ఫాస్ట్‌ పథకాన్ని ప్రారంభిస్తున్నారు. దాదాపు 40 వేల మంది విద్యార్థులకు అల్పాహారాన్ని నిత్యం సరఫరా చేయనున్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.