
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్)(TCSS) ఆధ్వర్యంలో అంతర్జాలంలో గూగుల్ మీట్ ద్వారా 14-Sep-2026 ఉదయం శ్రీ వరసిద్ధి వినాయక చవితి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ పూజను ఇండియా నుండి మహబూబ్ నగర్ కు చెందిన శ్రీ వరసిద్ధి వినాయక ఆలయ పురోహితులు ఇరువంటి శ్రావణ్ కుమార్ శర్మ అంతర్జాలం ద్వారా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిఒక్కరికి సొసైటీ అధ్యక్షులు నల్ల భాస్కర్ గుప్త, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము, కోశాధికారి శెశిధర్ రెడ్డి ఎర్రమరెడ్డి, ఉపాధ్యక్షులు బసిక ప్రశాంత్ రెడ్డి, జూలూరి సంతోష్ కుమార్, మిర్యాల సునీత రెడ్డి, సంతోష్ వర్మ మాదారపు, విక్రమ్ చిట్ల సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు నంగునూరి వెంకట రమణ, నడికట్ల భాస్కర్, మహేష్ చెట్టిపెల్లి, కల్వ లక్ష్మణ్ రాజు మరియు శివ ప్రసాద్ ఆవుల, కార్యవర్గ సభ్యులు బొడ్ల రోజా రమణి, రవి కృష్ణ విజ్జాపూర్, పెరుకు శివ రామ్ ప్రసాద్, విజయ మోహన్ వెంగళ, సతీష్ పెసరు, చల్లా క్రిష్ణ, మణికంఠ రెడ్డి, భాస్కర్ రావు పులిగిళ్ల, ప్రవీణ్ మామిడాల, తోట రాజేంద్ర ప్రసాద్ , యసరావేణి విజయ కుమార్, మల్లారెడ్డి కల్లెం, సుకేందర్ నీలం మొదలగు వారు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలకు సహకారం అందించిన మై హోమ్ బిల్డర్స్, కుమార్ ప్రాపర్టీస్ (ప్రాప్నెక్స్) సింగపూర్, ASBL కన్స్ట్రక్షన్ కంపెనీ, సరిగమ గ్రాండ్ ఇండియన్ రెస్టారెంట్, వజ్రా రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ కంపెనీ, ఏపీజే అభిరామి, ఏపీజే జువెల్లర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎవోల్వ్, ఏ వి ఏం కన్స్ట్రక్షన్ అండ్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్, విజయ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ (కూల్ టైమ్ ఎయిర్కాన్ ఇన్స్టాలేషన్ & సర్వీస్), కామాక్షి సిల్వర్,గోల్డ్ & డైమండ్, బులియన్ కింగ్ కు సొసైటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.




