
రోజులో కాసేపు డీప్ బ్రీతింగ్ ప్రాక్టీస్ చేయండి. ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు డీప్ బ్రీత్ తీసుకోండి. దీని వల్ల నాడీ వ్యవస్థ కూల్ అవుతుంది. మానసికంగా ఆరోగ్యంగా ఉండొచ్చు.
క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. దీని వల్ల ఎండార్పిన్లు రిలీజ్ అవుతాయి. ఒత్తిడి తగ్గుతుంది. మానసికంగా ఆరోగ్యంగా ఉండొచ్చు.
రోజులో కాసేపు నచ్చిన వారితో సమయం గడపండి. లేదా మీకు నచ్చిన వారితో ఫోన్ మాట్లాడండి. దీంతో మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తిడి తగ్గుతుంది.
మీరు చేయలేని, మీకు ఇష్టం లేని పనులను మీకు అప్పగిస్తే నో చెప్పండి. నో చెప్పకుండా పని చేస్తే మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది.
అన్ని రకాల విటమిన్లు, మినరల్స్ ఉన్న ఆహారాన్ని తినండి. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినడం వల్ల మానసికంగా ఆరోగ్యంగా ఉండొచ్చు.
ఫోన్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. సోషల్ మీడియాలో సమయం గడిపితే కంపేరిజన్ పెరిగి మానసిక ఆందోళన వస్తుంది.
రోజులో కాసేపు ప్రకృతిలో సమయం గడపండి. పచ్చని చెట్లు, ఆకాశం, పక్షులను గమనించండి. దీని వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తిడి తగ్గుతుంది.
రోజులో 8 గంటల పాటు ప్రశాంతంగా నిద్రపోండి. ఒకే సమయానికి పడుకొని, ఒకే సమయానికి నిద్రలేవండి. దీంతో మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ప్రతిరోజూ కాసేపు ధ్యానం చేయండి. దీని వల్ల ఒత్తిడి తగ్గుతుంది. మనసు ప్రశాంతంగా మారుతుంది. మానసికంగా ఆరోగ్యంగా ఉండొచ్చు.





