
ఎండాకాలంలో వేడి ఉంటుంది. వర్షాకాలంలో వేడి ఉండదు. కానీ, తేమ ఎక్కువగా ఉంటుంది. దీనిని తగ్గించేందుకు ఎయిర్ కండిషనర్స్ ఎక్కువగా పనిచేయాల్సి ఉంటుంది. ఏసిని నార్మల్ రోజుల్లానే కూల్ మోడ్‌లో నడిపితే ఎఫెక్టివ్‌గా ఉండదు. డ్రై మోడ్‌కి మార్చడం వల్ల ఎక్కువగా చల్లబరచకుండానే తేమని తగ్గించి ఎనర్జీని సేవ్ చేయొచ్చు. దీంతో కరెంట్ బిల్ తగ్గుతుంది . కాబట్టి, వర్షాకాలం రాగానే ఏసి వేసిన ప్రతీసారి మోడ్ మార్చండి. తేమతో కూడిన గాలి AC ఫిల్టర్స్, డక్ట్‌ల లోపల పేరుకుపోతుంది. అంటే గాలి ప్రసరించే మార్గాల్లో పేరుకుపోతుంది. అందుకే, వీటిని రెగ్యులర్‌గా క్లీన్ చేయాలి . లేదంటే దుర్వాసన రావడమే కాకుండా దగ్గు, తుమ్ముల వంటి శ్వాస సమస్యలు వస్తాయి. ప్రతీ రెండు వారాలకి ఓ సారి ఫిల్టర్స్‌ని క్లీన్ చేయడం మంచిది. ఇది గాలి నాణ్యతని మెరుగ్గా చేసి AC సరిగ్గా పనిచేసేలా చేస్తుంది. వర్షాకాలంలో వచ్చే వర్షాలతో కరెంట్ ఎక్కువ, తక్కువగా వస్తుంది. ఫ్లచ్యూయేట్ అవుతుంటుంది. దీంతో కరెంట్ అంతరాయాలు, ఓల్టేజ్ తగ్గుదల ఉంటుంది. దీనిని మనం స్టెబిలైజర్, సర్జ్ ప్రొటెక్టర్తో సెట్ చేయాలి. లేదంటే సడెన్‌గా వచ్చే ఫ్లచ్యూయేషన్ ఏసి అంతర్గత భాగాలని దెబ్బతీస్తాయి. కాబట్టి, సరైన స్టెబిలైజర్ వాడండి. వర్షాకాలంలో అవుట్డోర్ యూనిట్ బయటే ఉండి వర్షపు నీటికి నాని ఈజీగా దెబ్బతింటుంది. దీంతో డ్రైన్స్ తుప్పు పట్టడం, లేదా ఏదైనా రిపేర్ వస్తుంది. ఏసి యూనిట్ పనితీరు తగ్గుతుంది. కాబట్టి, అవుట్డోర్ యూనిట్‌ని నీరు పడని స్థలంలో పెట్టడం మంచిది. అప్పుడు అవుట్డోర్ యూనిట్ నానదు. ఏసి పాడుకాదు. వర్షాకాలంలో వాతావరణం సహజంగానే చల్లగా, తేమగా ఉంటుంది. దీనికి తగ్గట్టుగా టెంపరేచర్ని అడ్జస్ట్ చేయాలి. అలా కాకుండా 18 డిగ్రీల సెల్సియస్ అలా పెడితే గొంతునొప్పి, ఒంటి నొప్పుల వంటి సమస్యలు, ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే, 24 నుండి 26 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ని సెట్ చేయడం మంచిది. దీంతోపాటు ఫ్యాన్ కూడా కొద్దిగా రన్ చేయాలి. దీంతో ఎలాంటి సమస్యలు రావు. ఇలా కొన్ని విషయాలని మీరు దృష్టిలో పెట్టుకుంటే ఏసిని వర్షాకాలంలో కూడా చక్కగా వాడుకోవచ్చు. ముఖ్య . కొన్ని అధ్యయనాలు, కొందరు నిపుణులు పేర్కొన్న అంశాల ఆధారంగా తెలియజేశాము. వీటిని పాటించే ముందు నిపుణుల సలహా తీసుకోండి. అలాగే వీటిని ఎంత వరకు పాటించాలనేది, విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం. సమయం తెలుగు వీటిని ధృవీకరించడం లేదు.





