
Shriya Saran | తెలుగుతోపాటు పాన్ ఇండియా ప్రేక్షకులకు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేని భామ శ్రియాశరణ్. తెలుగు, తమిళం, మలయాళం, హిందీలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ భామ నటించిన తమిళ చిత్రం Sandakari. వెమల్, శ్రియా కాంబోలో రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీని 2019లో షూట్ చేయగా.. 2020లో విడుదలకు ప్లాన్ చేశారు. ఆర్. మధేశ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని బాస్ ప్రొడక్షన్ కార్పొరేషన్ బ్యానర్‌పై తెరకెక్కించారు. ఈ సినిమా థియేటర్లలోకి విడుదల కాకముందే తమిళనాడు స్టేట్ ఫిలిం అవార్డ్స్ -2020కి గాను మూడు అవార్డులను గెలుచుకోవడం అందరినీ షాక్ గురి చేసింది. ఉత్తమ సినిమా కేటగిరీలో మూడో బహుమతి, బెస్ట్ మేల్ ప్లే బ్యాక్ సింగర్ అమ్రిష్, అయ్యప్పన్ బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ అవార్డులను గెలుచుకున్నారు. అయితే సినిమా రిలీజ్ కాకముందే ఇలా అవార్డులకు ఎలా ఎంపిక అవుతుందనే విషయంలో పలు విమర్శలు చుట్టుముట్టాయి. ఫైనల్‌గా చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ సినిమా విడుదల తేదీ ఫిక్సయింది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 18న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. Sandakari 2012లో మలయాళంలో తెరకెక్కిన మై బాస్ చిత్రానికి రీమేక్. ప్రభు, సత్యన్, కేఆర్ విజయ, రేఖ, దేవ్ గిల్, ఉమా పద్మనాభవన్, పున్నాగై పూ గీత, క్రేన్ మనోమర్, మహనంది శంకర్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. అమ్రిష్ సంగీతం అందించాడు. మరి ఈ సినిమా తెలుగులో కూడా వస్తుందా అనేది చూడాలి. Walking vs Yoga | నడక మంచిదా.. యోగా మంచిదా? మీ ఆరోగ్యానికి ఏది సరైనదో తెలుసుకోండి





