
“ఆ రోజు మరో సాధారణ రోజులాగే గడిచింది, కానీ మా యుద్ధవిమానం పై ఇరాన్ ఒక మిసైల్ తో దాడి చేసింది, ” అని బ్రావో గుర్తుచేసుకున్నారు. దశాబ్దాలుగా అమెరికాకు సేవలందిస్తున్న 30 మిలియన్ డాలర్ల ఖరీదైన టూ-సీటర్ F-15E ఫైటర్ జెట్‌ను ఇరాన్, కేవలం లక్ష డాలర్లు ఖరీదు చేసే భుజం పై నుంచి కాల్చిన మిస్సైల్ తో కూల్చేసిందని తెలిపారు. మిస్సైల్ విమానాన్ని తాకిన క్షణం ఒక భారీ రైలు ఢీకొన్నట్లు అనిపించిందని బ్రావో గుర్తుచేసుకున్నారు. యుద్ధవిమానాన్ని రక్షించడానికి ‘అల్ఫా’ చేయగలిగినదంతా చేశాడని, కానీ విమానాన్ని కాపాడలేమని గ్రహించి ఇద్దరూ పారాచూట్ తెరచి బయటపడ్డామనీ చెప్పుకొచ్చారు.
Recommended for you

generalఏఐ పోరులో గెలుపెవరిది?



