
అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధంతో గత ఆరు నెలల నుంచి పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. తమపై వాషింగ్టన్ దాడులకు ప్రతీకారంగా గల్ఫ్‌లో అమెరికా స్థావరాలపై ఇరాన్ ప్రతీకార చర్యలకు దిగుతోంది. దీంతో అమెరికా మిత్రదేశమైన యూఏఈ ఈ దాడులతో తీవ్రంగా ప్రభావితమవుతోంది. ఇది ఇరు దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీసింది. అయితే, న్యూఢిల్లీలో జరిగిన 18వ బ్రిక్స్ సదస్సులో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.





