
భామిని: చిరు, పప్పుధాన్యాల సాగుపై ప్రతి రైతు దృష్టి సారించేలా చర్యలు తీసుకోవాలని పాలకొండ ఏడీఏ రత్నకుమారి అన్నారు. బుధవారం మండలంలోని బొడ్డగూడ గిరిజన గ్రామంలో మండల వ్యవసాయాధికారిణి షేక్ ఆఫ్రిన్ ఆధ్వర్యంలో ‘పొలం పిలుస్తోంది’కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో ఒకే రకమైన ప్రధాన పంటలపై ఆధారపడకుండా రకరకాల పంటలను సాగు చేయాలన్నారు. వేర్వేరు పంటలను సాగు చేయడం ద్వారా ఒక పంట దెబ్బతిన్నా మరొక పంట ద్వారా ఆదాయం సమకూరి నష్టం తగ్గుతుందన్నారు. ఎల్‌నినో కారణంగా వేడి, పొడి వాతావరణం ఏర్పడి పురుగులు, క్రిమి కీటకాలు వేగంగా విస్తరిస్తాయని, దాన్ని నివారించాలంటే పంట మార్పిడి చేయడం ద్వారా చీడపీడలకు అడ్డుకట్ట వేయవచ్చని వివరించారు. ఎక్కువ నీరు కావాల్సిన పంటల స్థానంలో తక్కువ కాలపరిమితి కలిగి, కరవును తట్టుకునే ధాన్యాలను సాగు చేయాలని రైతులకు అవగాహన కల్పించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





