
NSE IPO | ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలోనే అతిపెద్ద స్టాక్‌ ఎక్స్ఛేంజీ ఎన్‌ఎస్‌ఈ పబ్లిక్‌ ఇష్యూకు (NSE IPO) వస్తోంది. సెప్టెంబర్‌ 17న రూ.22,562 కోట్ల మెగా ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌కు రానుంది. సెప్టెంబర్‌ 21న ముగియనుంది. ధరల శ్రేణి రూ.1700-1785. అప్పర్‌ ప్రైస్‌ బ్యాండ్‌ వద్ద రిటైల్‌ ఇన్వెస్టర్లు ఎనిమిది షేర్లు కలిగిన ఒక్కో లాట్‌ కొనుగోలుకు రూ.14,280 వెచ్చించాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ ఐపీఓకు దరఖాస్తు చేద్దామనుకుంటే.. ఎన్‌ఎస్‌ఈకి సంబంధించిన కీలక అంశాలతో పాటు రిస్కులూ తెలుసుకోవాల్సిందే. హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా (రూ.27,870 కోట్లు) తర్వాత దేశంలో రెండో అతిపెద్ద ఐపీఓగా ఎన్‌ఎస్‌ఈ ఇష్యూ నిలవనుంది. 2022లో వచ్చిన ఎల్‌ఐసీ (రూ.21,000 కోట్లు) ఐపీఓను ఎన్‌ఎస్‌ఈ అధిగమించనుంది. ఈ ఇష్యూలో అర్హత కలిగిన సంస్థాగత మదుపర్ల (క్యూఐబీల)కు 50%, సంస్థాగతేతర మదుపర్లకు 15%, రిటెయిల్‌ మదుపర్లకు 35% కేటాయించారు. సెప్టెంబరు 24న బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ (బీఎస్‌ఈ)లో ఎన్‌ఎస్‌ఈ షేర్లు నమోదు కానున్నాయి. . స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులను ఈనాడు.నెట్‌ ప్రోత్సహించడం లేదు. పెట్టుబడులపై సొంతంగా లేదా ఆర్థిక నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకోండి. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.



