
గిన్నె తీసుకుని అందులో నీళ్లు నింపండి. ఇందులో పుదీనా ఆకులు, నిమ్మ, నారింజ ముక్కలు, దాల్చినచెక్క వంటివి వేసి మరిగించండి. ఇలా చేస్తే ఆ సువాసన ఇల్లు అంతా వస్తుంది. దుర్వాసన తగ్గుతుంది.
ఇంట్లోని దుర్వాసన పోగొట్టడంలో బేకింగ్ సోడా సహాయపడుతుంది. దీనికోసం ఓపెన్ బౌల్లో కొద్దిగా బేకింగ్ సోడా వేసి, కొద్దిగా రోజ్మేరీ ఆయిల్ కలిపి ఇంట్లో ఓ మూలన ఉంచితే సరిపోతుంది.
ఇంట్లో ఓ గిన్నెలో ఎండిన లేదా తాజా గులాబీ పూల రెమ్మలు నింపండి. ఇందులో కొద్దిగా లావెండర్ ఆయిల్ వేసి ఒక దగ్గర పెడితే సరిపోతుంది.
ఇంటిని సువాసనభరితంగా మార్చడానికి కొన్ని మొక్కలు కూడా సహాయపడతాయి. దీనికోసం మల్లె, పు దీనా, లావెండర్, యూకలిప్టస్, రోజ్మేరీ లాంటి మొక్కలు సహాయపడతాయి.
ఇంట్లోని దుర్వాసన పీల్చుకుని మంచి వాసన నింపడంలో కాఫీ గింజలు సహాయపడతాయి. దీనికోసం ఓపెన్ బౌల్లో కాఫీ గింజలు వేసి ఇంట్లో మూలకు పెడితే మంచిది.
వైట్ వెనిగర్‌లో నిమ్మ లేదా నారింజ తొక్కలు రెండు వారాల పాటు నానబెట్టండి. తర్వాత వడబోసి ఈ మిశ్రమంతో ఇంటిని తుడిస్తే ఇల్లు సువాసన వస్తుంది.
యూకలిప్టస్ ఆయిల్ వాసన చాలా బాగుంటుంది. దీనిని ఇంట్లో స్ప్రే చేస్తే ఇంటిని సువాసనభరితంగా మార్చవచ్చు. లేదంటే ఆ మొక్కను ఇంట్లో పెంచినా సరిపోతుంది.
లావెండర్ ఆయిల్ ఇంటిని సువాసనభరితంగా మారుస్తుంది. దీనికోసం నీళ్లలో కొన్ని చుక్కల లావెండర్ ఆయిల్ కలిపి ఇంట్లో అవసరం ఉన్నపుడు స్ప్రే చేస్తే సరిపోతుంది.
వెనీలా ఎక్స్ట్రాక్ట్ ఇంటికి సువాసన అందించడంలో సహాయపడుతుంది. దీనికోసం వెనీలా ఎక్స్ట్రాక్ట్లో కాటన్ బాల్ ముంచి షెల్ఫ్‌లో ఎక్కడో ఓ చోట పెడితే సరిపోతుంది.


