
ధీరజ్ మౌనంగా ఉంటాడు. "రేయ్.. ఆపరా నువ్వు నీ నాటకాలు. దీని వెనుక నువ్వే ఉన్నావని.. నువ్వే అసలు సూత్రధారివి, పాత్రధారివి అని.. నువ్వే వెనక ఉండి నీ కోడుకుతో ఈవన్నీ చేయించావని నాకు బాగా తెలుసు"అంటూ రామరాజుకు గట్టిగా ఇచ్చిపడేస్తుంది భద్రావతి. "భద్రావతి.. నిజం ఏంటో తెలియకుండా, తెలుసుకోకుండా బుద్దిలేకుండా వాగకు" అంటాడు రామరాజు. "ఏంట్రా తెలుసుకునేది. చేయాల్సిందంతా చేసి కూడా ఇంకా నోరు లేస్తుందేంట్రా" అంటాడు సేనాపతి కోపంగా. "సేనాపతి నేను చెప్పేది విను" అంటాడు రామరాజు. "ఏంట్రా వినేది.. మా కుటుంబం మీద పగతో జమీందారు కోడుకైన నా తమ్ముడికి, కూటికి గతిలేని దానితో నీ కోడుకు ద్వారా నువ్వు పెళ్లి చేయించావు" అంటూ రామరాజు మీదకు వెళ్తాడు సేనాపతి కోపంగా. అప్పుడే తిరుపతి కల్పించుకుని.. "అన్నయ్యా.. అనవసరంగా బావను ఏమీ అనకు. పాపం ఈ విషయం గురించి బావకు ఏమీ తెలియదు" అంటాడు తిరుపతి. "నువ్వు నోరు మూయ్యిరా" అంటూ తిరుపతిని లాగిపెట్టి కొడుతుంది భద్రావతి. "మన స్థాయికి తగ్గ సంబంధం చూస్తే ఈ గతిలేనిదాన్ని పెళ్లి చేసుకుంటావా. ఏయ్.. నా తమ్ముడిని నిశ్చితార్థం నుంచి వెళ్లిపోయి పెళ్లి చేస్తావా. అందరి ముందు మా పరువు తీస్తావా. అందరూ మీ అయ్యలాగా.. మీ కుటుంబం లాగా పరువు మర్యాద లేకుండా దిగజారి ఉంటారనుకుంటున్నావా. మీ కొంపలో వాళ్లకి లేచిపోయి పెళ్లి చేసుకోవడం అలవాటు కాబట్టి.. అందరిని అలాగే తీసుకెళ్లిపోయి పెళ్లి చేస్తావారా " అంటుంది భద్రావతి. దాంతో ధీరజ్.. "ఏయ్.. ఆపమ్మా.. ఆపు. ఇందాకటి నుంచి మా తమ్ముడిని తీసుకెళ్లిపోయి పెళ్లి చేశావు అని అంతలా అరుస్తున్నావు. అయినా ఎంతసేపు నన్ను ఒక్కడినే అంటావు. నీ మేనకోడలుని అనవా" అంటూ ప్రేమను ముందుకు లాగుతాడు. "నువ్వు తప్పు చేసి నా మేనకోడలిని అంటావేంట్రా" అంటుంది భద్రావతి. "హాలో.. ఈ పెళ్లికి నేను ఒక్కడినే కాదు. తను కూడా పెళ్లి పెద్దే. నేను నా పెళ్లాం దగ్గరుండి ఈ పెళ్లి చేశాం" అని ధీరజ్ చెప్పడంతో అందరూ షాకవుతారు. "సచ్చినోడా. నన్ను ఇరికించి చచ్చావేంట్రా" అంటుంది ప్రేమ. "ఇరికించడం ఏంటే.. ఇందాకంతా వీళ్ల పెళ్లి కోసం డాషింగ్ గా, డేరింగులు చేసావు కదా. ఇప్పుడిలా పిరికిదానిలా భయపడతావేంటీ. ఏహే.. భయపడకు. నేను నా మొగుడు కలిసి ఈ పెళ్లి చేశామని ధైర్యంగా చెప్పు" అంటాడు ధీరజ్ మెల్లగా. "అబ్బా. వీడు నన్ను అడ్డంగా బుక్ చేసి చచ్చాడే" అని మనసులోనే అనుకుంటుంది ప్రేమ. "మంచో చెడో ఈ పెళ్లి అయిపోయింది. వదిలేయండి ప్లీజ్" అంటుంది నర్మద మధ్యలో. "ఏంటే.. ఏంటే వదిలేసేది. అంతా మీ కుటుంబం ప్లానే అని నాకు తెలియదు అనుకుంటున్నావా. ఏయ్ వేదవతి, ఏయ్ రామరాజు. నేను రావడం కొంచెం లేట్ అయి ఉంటే ఈ పాటికి వీళ్లను ఆశీర్వదించి లోపలికి తీసుకెళ్లేవాళ్లు కదరా" అంటుంది భద్రావతి. ఆ మాటతో వేదవతి.. " చూడు భద్రావతీ... ఈ పెళ్లికి మాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్తున్నావా అర్థం కదా నీకు. ఇంకా బుద్ధి లేకుండా అలాగే వాగుతావే. ఏంటీ ఏమన్నావు. మేము ఆశీర్వదించి ఇంట్లోకి తీసుకెళ్లేదాన్నా.. అసలు ఈ జన్మలోనే వీళ్లను నా ఇంటి గుమ్మం తొక్కనిచ్చే దానినే కాదు. అది తెలుసుకో. వీళ్లను మా ఇంట్లోకి రానిస్తే వీళ్ల పెళ్లికి మాకు సంబంధం ఉందన్నట్లుగా మాట్లాడుతున్నావు కదా. ఇప్పుడు వీళ్లను మీ ఇంట్లోకి తీసుకెళ్లాలి. ఎందుకంటే నా తమ్ముడిని నా ఇంట్లోనే ఉంచుకుంటాను అని ఆరోజు తీసుకెళ్లిపోయావు కదా. మరి వీళ్ల పెళ్లికి నీకు సంబంధం ఉన్నట్టేనా. నువ్వు ప్లాన్ చేసి వీళ్ల పెళ్లి చేసినట్టేనా. చెప్పు. నువ్వు ప్లాన్ చేసి వీళ్ల పెళ్లి చేసినట్టేనా. నువ్వు వీళ్లను ఇంట్లోకి రానిస్తావా " అని అడుగుతుంది వేదవతి. "ఏయ్.. నేనెందుకు రానిస్తాను. నా ఇంటి పరువు తీసినవాడు నా తమ్ముడైనా సరే. నా ఇంటి గుమ్మం కూడా తొక్కనివ్వను. నిన్ను చిన్నప్పటి నుంచి అక్కలా కాకుండా అమ్మలా ప్రాణంగా చూసుకున్నానే. నువ్వు ఈ పనోడిని పెళ్లి చేసుకున్నావని గుండె చప్పుడైనా నిన్నే వదులుకున్నాను. మరి వాడిని వదులేసుకోలేనా" అంటుంది భద్రావతి. ఇంతలో శారదాంబ.. "భద్రావతి. ఏంటే ఇది బుద్ధిలేకుండా. మీ అక్కాచెల్లెళ్లు ఇద్దరూ గొడవపడి వాళ్లను ఇంట్లోకి రానివ్వను అంటున్నారేంటీ. మీరెవరు రానివ్వకపోతే వాడు ఎక్కడికి పోతాడు" అంటూ బాధపడుతుంది. "అవును. జరిగింది ఏదో జరిగిపోయింది. పెళ్లి చేసుకుని ఒక ఇంటివాడు అయ్యాడు. ఆశీర్వదించి ఇంట్లోకి రమ్మని చెప్పండి. వాళ్లకంటూ ఒక జీవితం ఏర్పడుతుంది" అంటుంది రేవతి. "వెదవ సలహాలు ఇవ్వకు. నోరు మూసుకుని ఉండు. వాడికి ఆ ఇంట్లో ఉండే అధికారమే లేదు" అంటాడు సేనాపతి. "ఆ ఇంట్లో మీది మాత్రమే కాదు. వాడిది కూడా. మరి వాడికి ఇంట్లో ఉండే హక్కు లేదంటారు ఏంటీ" అంటుంది శారదాంబా. "ఒకవేళ వాడు ఇంట్లోకి వస్తే అక్కా.. నేను ఇంట్లో ఎవరం ఉండము. వాడా మేమా. ఇది మాత్రమే చెప్పు" అంటాడు సేనాపతి. "మామ.. నీ పెళ్లి గొడవ ఏటేటో వెళ్తుంది. ప్రస్తుతానికి కొన్నిరోజులు ఆ భాగ్యం వాళ్ల ఇంట్లో మకాం వెయ్యి ఆ తర్వాత సంగతి తర్వాత" అని ధీరజ్ అనడంతో సుక్కుని తీసుకుని రామరాజు వద్దకు వెళ్తాడు తిరుపతి. "బావ.. మేము ఇద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. ఇందులో ఎవరి తప్పు లేదు. ఎవరి ప్రమేయం కూడా లేదు. బావ.. నువ్వు నన్ను ఒక బిడ్డలా పెంచావు. నేను నిన్ను బావలాగా కాకుండా తండ్రిలాగే చూశాను. నీ బిడ్డ జీవితం బాగుండాలని.. సంతోషంగా ఉండాలని కోరుకుంటే నీ పెద్ద మనసుతో మమ్మల్ని ఆశీర్వదించు బావ" అంటూ రామరాజు కాళ్లమీద పడతాడు తిరుపతి. "సరే సరే ఏదోకటి చేసుకుని చావు. లేవండి. చల్లగా ఉండండి" అంటూ దీవిస్తాడు రామరాజు. ఇక వేదవతి కాళ్లపై పడటానికి రావడంతో కాళ్లు విరగ్గొడతా వెళ్లండి అంటూ సీరియస్ అవుతుంది వేదవతి. ఇక శారదాంబా ఆశీర్వాదం తీసుకుంటాడు తిరుపతి. ఇక సుకన్యను తీసుకుని భాగ్యం ఇంటికి వెళ్తూ.. ధీరజ్ దగ్గరకు వెళ్లి.. చిన్నల్లుడూ బండి తాళం ఇవ్వరా అంటూ తాళం తీసుకుని హగ్ చేసుకుని ఎమోషనల్ అవుతాడు. సుక్కూని తీసుకుని ఎవరూ లేని వాడిలా తిరుపతి.. సుక్కుని తీసుకుని వెళ్లే సీన్ చాలా ఎమోషనల్గా ఉంటుంది. ఇక భద్రావతి కోపంగా "ప్రేమ నీతో మాట్లాడాలి రా" అంటూ ప్రేమను తీసుకుని వెళ్తుంది భద్రావతి. ఇక ఇంటి ముందు ఆగి.. "ఏయ్.. దెబ్బ మీద దెబ్బ కొడుతున్నావు. ప్రేమను నీకు శాశ్వతంగా దూరం చేస్తాను " అంటుంది భద్రావతి. "నీకు అంత సీన్ లేదులే వెళ్లు" అంటాడు ధీరజ్. రేయ్ నువ్వు ఇలా రారా అంటూ ధీరజ్ ను లోపలికి తీసుకెళ్తుంది వేదవతి కోపంగా. గదిలోకి తీసుకెళ్లి ధీరజ్ చెంప పగలగొడుతుంది వేదవతి. "నీకెందుకు రా. బోడి పెత్తనాలు. నువ్వు అప్పుడే పెళ్లిల్లు చేసేంత గోప్పోడివి. పెద్దోడివి అయిపోయావా. అయినా పోయి పోయి తెలిసి తెలిసి ఆ కొంపలు కూల్చే ఇంట్లోదాన్ని తీసుకోచ్చి పెళ్లి చేసి అమాయకుడైనా నా తమ్ముడి గొంతు కోశావు కదరా. వాడి జీవితం అన్యాయం అయిపోవడానికి కారణం అయ్యావు కదరా. ఆ వల్లి వాళ్ల కుటుంబం గురించి నీకు తెలుసు కదా. ఇప్పటికే ఒకదానితో పడుతున్నాం. వేగుతున్నాం కదా. మరి తెలిసి కూడా ఆ సుక్కుని తీసుకొచ్చి నా తమ్ముడికి కట్టాబెట్టావు ఏంట్రా. తిరుపతి విషయంలో మొన్న మన రెండు కుటుంబాల్లో ఎంత పెద్ద గొడవ జరిగిందో చూశావు కదా. మళ్లీ తీసుకెళ్లి దొంగచాటుగా పెళ్లి చేస్తే ఆ గొడవలు ఇంకా పెద్దవి అవుతాయనే బుద్ధి జ్ఞానం లేదా నీకు. చూశావు కదా. ఇందాక ఆ భద్రావతి మీ నాన్న గురించి, మన కుటుంబం గురించి ఎంత నీచంగా వాగిందో చూశావు కదా. నువ్వు తప్పు చేసి మీ నాన్నను మాటలు అనిపించావు. అయినా అవమానాలు మోసేలా చేశావు కదరా" అంటుంది వేదవతి బాధగా. "అది ఆల్రెడీ నీకు చెప్పాను కదా ధీరజ్. ఆ సుక్కు తిరుపతి బాబాయ్ కు కరెక్ట్ కాదు. తిరుపతి బాబాయ్ పెళ్లి విషయంలో నిన్ను జోక్యం చేసుకోవద్దని. చెప్పిన తర్వాత కూడా ఎందుకు ఇలా చేశావు చెప్పు. నువ్వేదో గొప్ప ఘనకార్యం చేసినట్టు నీకు నీ పెళ్లాం సపోర్ట్ ఒకటి. మొగుడు పెళ్లాలు ఇద్దరూ గొడవలు సర్దుమణిగి కలిసిపోయేలా చేయండయ్యా అని చెప్తే అది మాత్రం చెయ్యరు. కానీ ఇలాంటి పనికిమాలిన విషయంలో మాత్రం ఇద్దరికి ఎంత అండర్ స్టాడింగో. ఇద్దరు ఎంత కలిసికట్టుగా పనిచేశారో" అంటూ నిలదీస్తుంది నర్మద. దాంతో ధీరజ్.. "అమ్మా.. మన రెండు కుటుంబాల మధ్య గొడవలు అవుతాయని.. నువ్వు నాన్న నన్ను తిడతారని తెలిసి కూడా వాళ్లకు పెళ్లి చేశానంటే ఎందుకో చేశానో ఆలోచించవా" అంటాడు. "ఎందుకంటే బుద్దిలేక" అంటుంది వేదవతి. "సుక్కుతో పెళ్లి చేయకపోతే నీ తమ్ముడు చనిపోయి ఉండేవాడు. అవును. మామ సుక్కును ప్రేమించాడు. తనతో పెళ్లి జరక్కపోతే చచ్చిపోతాను అన్నాడు. అందుకే తప్పైనా తప్పక పెళ్లి చేశాను. ప్రేమించిన అబ్బాయితో పెళ్లి కాకపోతే.. ఆ మనిషి దూరమైతే ఆ బాధ ఎంత నరకంగా ఉంటుందో కావాలంటే పెద్దోడిని అడుగు " అంటాడు ధీరజ్. ఆ మాటతో చందు.. "అమ్మా.. చిన్నోడు చెప్పింది కరెక్టే. అయినా తప్పులు ఎవరు చేయరు. నీ పెద్ద కోడలు ఎన్ని తప్పులు చేసినా క్షమించి ఇంట్లో పెట్టుకుంటున్నావు కదా. అయినా సుక్కు వాళ్లకు సపోర్ట్ చేసినంత మాత్రానా. తను కూడా వాళ్లా లాగే అవుతుందా చెప్పు" అంటాడు. "అయినా మీరేంటీ బావగారు. మీ తమ్ముడు చేసింది తప్పు అని చెప్పాల్సింది పోయి. సపోర్ట్ చేస్తున్నారు" అంటుంది నర్మద. అప్పుడే బయట డోర్ దగ్గర వినడానికి ట్రై చేస్తున్న వల్లిని రామరాజు చూస్తాడు. "ఏంటమ్మ.. ఏం జరుగుతుంది అక్కడ" అంటాడు రామరాజు. వెంటనే వల్లి.. "ఎప్పుడు ఇంతే మామయ్యగారు. ఇట్టా తలుపులు పెట్టుకుని రహస్య మీటింగులు పెట్టేసుకుని మాట్లాడేసుకుంటారు" అని చెబుతుంది వల్లి కావాలని. దీంతో డోర్ తీసి లోపలికి వెళ్తాడు రామరాజు. "తలుపులు వేసుకుని ఏంటీ మీ మంతనాలు. రసహ్యంగా ఏంటీ మీ మీటింగులు. జీవితకాలం అన్నీ ఇలా రహస్యంగానే చేసుకుంటావా. ఈ ఇంటికి ఒక పెద్ద దిక్కు ఏడ్చాడు. మంచైనా, చెడైనా వాడికి చెప్పాలి అనే జ్ఞానం ఈ జన్మలో రావా నీకు" అని సీరియస్ అవుతాడు రామరాజు. "వీడు చేసిన వెదవ పనికి ఎడాపెడా నాలుగు పీకి తిడుతున్నానండి" అంటుంది వేదవతి. "అసలు అదంతా నీవల్లే" అని రామరాజు అనడంతో





