నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న భారీ చిత్రం ‘ది ప్యారడైజ్’ గురించి స్టంట్ మాస్టర్లు రామ్-లక్ష్మణ్ ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. తెలంగాణ అండర్‌గ్రౌండ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తల్లీకొడుకుల మధ్య సాగే మదర్ సెంటిమెంట్ ప్రధాన హైలైట్‌గా నిలుస్తుందని తెలిపారు. గతంలో వచ్చిన ‘దసరా’ కంటే ఇందులో మూడు రెట్లు భారీ యాక్షన్ ఘట్టాలు ఉంటాయని, వాటికోసం నాని ఎలాంటి డూప్ లేకుండా రిస్కీ స్టంట్స్ చేశారని కొనియాడారు.





