
ఆదోని నేర వార్తలు: కర్నూలు జిల్లాలో తాళం వేసిన ఇళ్లకు కన్నం వేసే దొంగను మంగళవారం ఆదోని రెండో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. సీఐ రాజశేఖర్ రెడ్డి ఈ కేసు గురించి మాట్లాడుతూ.. ఆదోని పట్టణంలో ఇటీవల తాళం వేసిన ఇళ్లల్లో దొంగతనాలు చోటు చేసుకోవడంతో బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. ఈ క్రమంలో అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన షికారి మద్దిలేటి చౌహాన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. అతని నుంచి రూ. 2.60 లక్షలు విలువచేసే 14 గ్రాముల బంగారు ఆభరణాలు, 50 గ్రాముల వెండి సామాగ్రి, రూ. 26,300 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





