
చర్ల : కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై రానున్న రోజుల్లో ప్రజా ఉద్యమాలను ఉద్ధృతం చేస్తామని బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జి రావులపల్లి రాంప్రసాద్ పేర్కొన్నారు. చర్లలోని పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు దొడ్డి తాతారావు అధ్యక్షతన మంగళవారం జరిగిన సమావేశంలో పార్టీ నియోజకవర్గ నాయకుడు మానే రామకృష్ణతో కలిసి ఆయన మాట్లాడారు. ప్రజా పాలన పేరిట వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు కష్టాలు కన్నీళ్లే మిగిలాయని విమర్శించారు. కాంగ్రెస్‌ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను సమీకరించి క్షేత్రస్థాయిలో పోరాటాలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఐన వోలు పవన్ కుమార్, కాకి అనిల్, అజీజ్, ఆంబోజి సతీష్, పంజా రాజు, పాసిగంటి సంతోష్ తదితరులు పాల్గొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





