
పత్తికొండ గ్రామీణం: ఆర్టీసీ బస్సు టైర్ పేలడంతో ముగ్గురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కర్నూలు జిల్లా పత్తికొండ-ఆదోని మార్గంలోని అటికల గుండు సమీపంలో చోటుచేసుకుంది. మంగళవారం ఆదోని డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అటికల గుండు సమీపంలోని వంతెన వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా టైర్ పేలడంతో బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆదోని ఆసుపత్రికి తరలించారు. పెద్ద శబ్దంతో టైరు పేలడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ప్రయాణికులు బస్సు దిగి ఇతర ప్రైవేటు వాహనాల్లో వెళ్లిపోయారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





